'ఇష్క్‌'హిందీ రీమేక్‌ హీరో ఎవరంటే...

By Srikanya

నితిన్ ,నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత నితిన్ కి హిట్ ఇచ్చిన ఈ చిత్రం ఇప్పుడు హిందీలోకి రీమేక్ అవుతోంది. ఎన్నో పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా హిట్‌ చిత్రాల సరసన నిలిచింది. దాంతో ఈ సినిమాపై బాలీవుడ్‌ కన్ను పడింది.

ఈ సినిమా హిందీ రీమేక్‌లో రణబీర్‌కపూర్‌ చేయనున్నారని వినిపిస్తోంది. అలాగే ఇష్క జాదే చిత్రంతో పరిచయమైన అర్జున్‌ కపూర్‌ పేరు కూడా తెరపైకి వస్తోంది. బోనీకపూర్‌ తన మొదటి భార్య కొడుకైన అర్జున్‌ కపూర్‌తో ఈ సినిమాని రీమేక్‌ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ తీసుకున్న బోనీకపూర్‌, సెట్స్‌పైకి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చూడటంలో బిజీగా ఉన్నాడట.

'ఇష్క్‌' సినిమా విషయానికి వస్తే 11 సెంటర్స్‌లో ఈ సినిమా ఈ రోజుతో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. బి,సి సెంటర్లు ఎలా ఉన్నా ఎ సెంటర్లలో బాగా వర్కవుట్ అయ్యింది. ఫ్యామీలీలు వీకెండ్ లలో ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపారు. కాలేజీ యూత్ కూడా ఈ చిత్రానికి బాగానే వస్తూండటంతో ఎగ్జిబిటర్స్ హ్యాపీగా ఉన్నారు. అలాగే సీడెడ్ లో ఇప్పటివరకూ ఏ నితిన్ చిత్రానికి రానీ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయని తెలుస్తోంది.

నిత్యామీనన్ న్యాచురల్ నటన,రొమాంటిక్ కామెడీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన విధానం,పి సి శ్రీరామ్ కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరో ప్రక్క రాజమౌళి వంటి దర్శకుడు ఈ చిత్రాన్ని పొగుడుతూ ట్వీట్ చేయటం కూడా అందరి దృష్టినీ ఈ చిత్రంపై పడేలా చేసింది. అందులోనూ ఈమధ్య తెలుగు సినిమాలు చాలావరకూ బాలీవుడ్‌ బాట పడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో 'ఇష్క్‌' చిత్రం కూడా బాలీవుడ్‌ రీమేక్‌ల జాబితాలోకి చేరిపోయింది. నితిన్‌-నిత్యమీనన్‌ జంటగా వచ్చిన 'ఇష్క్‌' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X