అల్లు అర్జున్ వల్లే ఆ సినిమా ఆలస్యం..
ఓ ప్రక్క వరుడు, మరో ప్రక్క ఆర్య-2 చిత్రాలలో బిజీగా ఉన్న అల్లు అర్జున్..క్రిష్ దర్శకత్వంలో రానున్న వేదం లోనూ చేస్తున్నారు.ఆ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మిగతా చిత్రాలను ఫినిష్ చేసే పనిలో...వేదానికి డేట్స్ సరిగా కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. దాంతో బన్నీ షూటింగ్ పార్ట్ మిగతా చిత్రం ఫినిష్ అయింది. అల్లు అర్జున్, మనోజ్, అనూష్క, మనోజ్ బాజ్ పాయ్ కాంబినేషన్ సీన్స్ బ్యాలన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో అనూష్క..వేశ్యగా చేస్తోంది. అల్లు అర్జున్..స్లమ్ బోయ్ గా కనిపిస్తాడు. అలాగే మనోజ్ రాక్ స్టార్ గా కనిపించి అలరిస్తాడు. ఇక అల్లు అర్జున్ జోడీ ఎవరన్నధి ఇంకా ఫైనలైజ్ చేయలేదు. హన్సిక, తమన్నా అంటూ రకరకాల పేర్లు వినిపించినప్పటికీ క్యారెక్టర్ చిన్నది కావటంతో ఎవరూ చేయటానికి ఆసక్తి చూపక డేట్స్ ఖాళీ లేవని చెప్పుతున్నారని వినపడుతోంది. ఇక ఈ చిత్రం మల్టిఫుల్ నేరేషన్ స్టైల్లో కధనం నడుస్తుంది.


Click it and Unblock the Notifications











