లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆ ఇద్దరు స్టార్స్
లైంగిక వేధింపుల అంశాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న ఓ బాలీవుడ్ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రామ్ పాల్, చిత్రాంగద సింగ్‌లు ఎంపికయ్యారు. 'ఇంకార్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈచిత్రానికి సుధీర్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సెక్సువల్ హారాస్‌మెంట్స్ బ్యాక్ డ్రాప్‌తో కూడిన ప్రేమ కథ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధీర్ మిశ్రా మాట్లాడుతూ...అర్జున్ రాంపాల్, చిత్రాంగద తో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. పని చేసే ప్రదేశాల్లో జరిగే సెక్సువల్ హరాస్‌మెంట్‌ని ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుందన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి ఆగస్టుకల్లా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
చిత్రాంగద గురించి సుధీర మిశ్రా మాట్లాడుతూ...ఆమె మంచినటి, అందంగా ఉంటుంది. నేను రాసుకున్న కథకి ఆమె పర్ పెక్టుగా సరిపోతుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు బాగా సూటవుతుందని చెప్పుకొచ్చారు.
గతంలో చిత్రాంగద సుధీర్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన 'Hazaaron Khwaishein Aisi' సినిమా ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ గత సంవత్సరం ఈ భామ సుధీర్ దర్శకత్వంలో 'Yeh Saali Zindagi' అనే చిత్రంలో నటించింది. తాజాగా ఈ చిత్రం ద్వారా ఈ ఇద్దరి కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











