చెర్రీ సినిమాలో షేర్‌ఖాన్‌గా అర్జున్ రాంపాల్
ఒరిజినల్ జంజీర్ చిత్రంలో ప్రముఖ నటుడు ప్రాణ్ పోషించిన షేర్ ఖాన్ పాత్రను రామ్ చరణ్ హీరోగా తాజాగా రూపొందుతున్న జంజీర్ రీమేక్ లో చేయడానికి అర్జున్ రామ్‌పాల్ అంగీకరించారు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న 'జంజీర్'రీమేక్ కోసం ఈ నటుడిని ఎంపిక చేసారు. మొదట ఈ పాత్ర కోసం సంజయ్ దత్ అనుకున్నారు కానీ సంజయ్ డేట్స్ దొరకలేదు. దానికి తోడు రామ్ చరణ్ కి ఎదురుగా యంగ్ నటుడు అయితే బాగుంటుందనే వాదన కూడా వినిపించటంతో సోనూ సోద్ ఆప్షన్ గా తీసుకున్నారు. అయితే సోనూసూద్ రెగ్యులర్ గా కనిపిస్గాతుండటంతో మరింత క్రేజ్ కోసం అర్జున్ రాంపాల్ ని ఎంపిక చేసారు.
ఇక అర్జున్ రాంపాల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ...అవును నేను జంజీర్ రీమేక్ లో చేస్తున్నాను. మోడ్రన్ టైమ్స్ లో చెప్పబడుతున్న జంజీర్ ఇది. కాబట్టి నా గెటప్ ..అప్పటి ప్రాణ్ ని అనుకరించాల్సిన పనిలేదు. దర్శకుడు అపూర్వకి, నాకు ఈ విషయమే కొన్ని ఐడియాలు ఉన్నాయి. మేమిద్దరం కలిసి త్వరలోనే ఫైనల్ లుక్ కోసం డెషిషన్ తీసుకుంటాం. తప్పకుండా నా పాత్ర అప్పటి ప్రాణ్ పాత్రలా నిలిచిపోయే విధంగా ఉంటుదనుకుంటున్నాను. అలాగే ఆ పాత్ర కోసం నేను జంజీర్ ని రీసెంట్ గా మరో మూడు సార్లు చూసాను. త్వరలోనే చిత్రం ప్రారంభం కానుది.
1973లో అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్'కి ఈ చిత్రం రీమేక్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. నాటి చిత్రంలో జయ బాధురి పోషించిన పాత్రకు ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకొన్నట్లు హిందీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దర్శకుడు ప్రియాంకతో చర్చించారు. ఆమె అంగీకారం తెలిపారు. అయితే అందుకు ఆమెకు ఆరు కోట్లు వరకూ రెమ్యునేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ సినిమాలో ఉంటే ఓపినింగ్స్ కు లోటు ఉండవని భావించి ఆమెను ఓకే చేసారు. రామ్ చరణ్ అక్కడ కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











