»   » హృతిక్ మాజీ భార్య మళ్లీ వార్తల్లో, అతడే సెలబ్రేట్ చేస్తాడా?

హృతిక్ మాజీ భార్య మళ్లీ వార్తల్లో, అతడే సెలబ్రేట్ చేస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘రాక్ ఆన్ 2' షూటింగులో ఉన్నాడు. షిల్లాంగ్ లో జరుగుతున్న షూటింగ్ ముగించుకుని ముంబై చేరుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ సుజానె ఖాన్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసేందుకే కాస్త ముందుగా షూటింగ్ ముగించాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య అయిన సుజానె అతనితో విడిపోయిన తర్వాత అర్జున్ రామ్ పాల్ కి దగ్గరయిందనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఇద్దరూ ఖండించినా రూమర్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా సుజానె ఖాన్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసేందుకే అతను షూటింగ్ త్వరగా ముంచుకోవడంతో మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి.

ఆ మధ్య అర్జున్ రామ్ పాల్, సుజానె ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇటు సుజానె కుటుంబ సభ్యులతో పాటు, అటు అర్జున్ రామ్ పాల్ కూడా ఖండించారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉంది, అంతకు ముంచి మరేమీ లేదనే సంకేతాలు కూడా ఇచ్చారు.

హృతిక్ రోషన్-సుజానె కలిసున్న రోజుల నుండి అర్జున్ రామ్ పాల్ వారికి చాలా క్లోజ్‌గా ఉండే వాడు. హృతిక్ తో పాటు, సుజానెకు కూడా అర్జున్ రామ్ పాల్ బెస్ట్ ఫ్రెండ్. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని స్లైడ్ షోలో...

సెలబ్రిటీస్
  

సెలబ్రిటీస్

బాలీవుడ్ సెలబ్రిటీల షారుక్ ఖాన్, అర్జున్ రాం పాల్, సుజానె, గౌరీ, ప్రియాంక, మెహర్

అరుదైన చిత్రం
  

అరుదైన చిత్రం

ప్రేమికులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జున్ రామ్ పాల్, సుజానె అరుదైన చిత్రం.

అర్జున్, సుజానె, గౌరీ
  

అర్జున్, సుజానె, గౌరీ

బాలీవుడ్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అర్జున్, సుజానె, గౌరీ

బాలీవుడ్ సెలబ్రిటీలు
  

బాలీవుడ్ సెలబ్రిటీలు

మెహర్, డినో మోరియా, ప్రీతి జింతా, సుజానె ఖాన్, అర్జున్ రామ్ పాల్ తదితరులు...

ప్రీతి, సుజానె, అర్జున్
  

ప్రీతి, సుజానె, అర్జున్

సుజానె, అర్జున్ రాంపాల్ తో కలిసి ప్రీతి జింతా...

పార్టీ
  

పార్టీ

బాలీవుడ్ కి సంబంధించిన ఓ పార్టీలో కెమెరాకు ఫోజులు ఇచ్చిన సెలబ్రిటీలు.

మెహర్, అర్జున్, సుజానె
  

మెహర్, అర్జున్, సుజానె

తన భార్య మెహర్, ఫ్రెండ్ సుజానెతో కలిసి అర్జున్ రామ్ పాల్.

సుజానె-అర్జున్
  

సుజానె-అర్జున్

సుజానె, అర్జున్ రామ్ పాల్ మధ్య ప్రేమాయణం ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu