అర్జున్ రెడ్డికి నేషనల్ ఫీవర్.. ప్యాంట్‌లో ఐస్ వేసుకోబోతున్న హీరోలు వీరే..

By Rajababu

Recommended Video

"Arjun Reddy" Remake In Multiples Languages

అర్జున్ రెడ్డి సినిమాతో.. విజయ్ దేవరకొండ సృష్టించిన సునామీ ఎఫెక్ట్.. బాలీవుడ్ కూ పాకినట్టుంది. ఈ సినిమాను చేసేందుకు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. త్వరలోనే స్పెషల్ షో వేసుకుని మరీ సినిమాను చూడాలని రణ్ వీర్ ట్రై చేస్తున్నాడట. త్వరలోనే సినిమాపై కమిట్ మెంట్ తీసుకోనున్నాడనీ.. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.

తొలి ఆటకే బ్లాక్ బస్టర్ అన్న టాక్

తొలి ఆటకే బ్లాక్ బస్టర్ అన్న టాక్

అర్జున్ రెడ్డి సినిమా ఇంతలా.. దేశం దృష్టిని ఆకర్షించడానికి సినిమా వసూళ్లు కూడా కారణమవుతున్నాయి. అనామక సినిమాగా వచ్చినా.. ట్రైలర్, టీజర్ విడుదల కాగానే సినిమాలో ఏదో ఉంది అన్న భావన కలిగించడంలో యూనిట్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సినిమా ప్రీమియర్ షో పడగానే.. అర్జున్ రెడ్డి మాసివ్ బ్లాక్ బస్టర్ అన్న టాక్.. టాలీవుడ్ అంతటా పాకింది.

వారంలోనే 31 కోట్ల వసూళ్లు

వారంలోనే 31 కోట్ల వసూళ్లు

సినిమా అద్భుతమని తెలియడంతో.. మిగతా భాషల్లోని బడా హీరోలు.. అర్జున్ రెడ్డిపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు. చిన్న సినిమాగా వచ్చి.. వారంలోనే.. 31 కోట్ల భారీ మొత్తం వసూలు చేయడంతో.. అర్జున్ రెడ్డి.. టాక్ ఆఫ్ ద నేషన్ అవుతున్నాడు.

పెద్దల ప్రశంసలు

పెద్దల ప్రశంసలు

అర్జున్ రెడ్డి చూసి ఫిదా అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. మూవీ విడుదలైన తెల్లారే రామ్ గోపాల్ వర్మ.. సినిమాను తన ట్వీట్లతో ఆకాశానికెత్తేశాడు. రియల్ పవర్ స్టార్ అని విజయ్ దేవరకొండకు బిరుదు ఇవ్వాలని ఇండస్ట్రీకి సూచించాడు. తర్వాత.. ఎస్ఎస్ రాజమౌళి కూడా.. సినిమా యూనిట్ ను అభినందించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాయలేడి సమంత కూడా.. అర్జున్ రెడ్డి అదుర్స్ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. దీంతో.. మూవీపై హైప్ మరింతగా పెరుగుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తమిళ్ లో కూడా..?

తమిళ్ లో కూడా..?

ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను.. రణ్ వీర్ హీరోగా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు మాత్రమే కాదు. తమిళ్ లో ధనుష్ హీరోగా సినిమా రీమేక్ అయ్యే చాన్సెస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీఐపీ 2 సినిమాతో చేతులు కాల్చుకున్న ధనుష్.. అర్జున్ రెడ్డిగా తమిళ్ లో హిట్ కొడదామన్న ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పోటీ లేకపోవడంతో...

పోటీ లేకపోవడంతో...

ఇప్పుడు విడుదలవుతున్న సినిమాల్లో.. అర్జున్ రెడ్డికి తగిన పోటీ ఇచ్చే సినిమా లేకపోవడంతో.. వసూళ్లు స్టడీగా నడుస్తున్నాయి. బాలయ్య బాబు పైసా వసూల్ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. త్వరలో రానున్న నాగచైతన్య యుద్ధం శరణం సినిమా మాత్రమే.. ఇప్పుడు అర్జున్ రెడ్డికి పోటీగా ఉంది. దీంతో.. ఇంకో రెండు, మూడు వారాల పాటు.. అర్జున్ రెడ్డి వసూళ్లకు ఏ మాత్రం ఢోకా లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X