రోడ్డు ప్రమాదంలో అర్జున్‌రెడ్డి సహ నిర్మాత మృతి.. విషాదంలో టాలీవుడ్

లాక్‌డౌన్‌లో వరుస మరణాలతో తల్లడిల్లుతున్న టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకొన్నది. నిర్మాత, డిస్టిబ్యూటర్ కమలాకర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డి తండ్రి కూడా మరణించడం మరింత విషాదంగా మారింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే..

Recommended Video

Tollywood Stars Chiranjeevi & Others Met AP CM YS Jagan Over TFI Isuues
కరోనా సోకిన తండ్రిని తరలిస్తూ...

కరోనా సోకిన తండ్రిని తరలిస్తూ...

నిర్మాత కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే తండ్రికి హైదరాబాద్‌లో మెరుగైన చికిత్సను అందించాలని కమలాకర్ నిర్ణయం తీసుకొన్నారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో

ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో

నిర్మాత కమలాకర్ రెడ్డి తన తండ్రి నందగోపాల్ రెడ్డిని తీసుకొని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యంలో నల్గొండ జిల్లాలోని కొండప్రోలు అనే గ్రామం వద్ద ఆగిఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్ింది. దాంతో నందగోపాల్, కమలాకరెడ్డి ప్రమాద స్థంలోనే మరనించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను హస్పిటల్‌కు తరలించారు.

మిర్యాలగూడ హాస్పిటల్‌కు తరలింపు

మిర్యాలగూడ హాస్పిటల్‌కు తరలింపు

కమలాకర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం మిర్యాలగూడ హస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కమలాకర్ రెడ్డి మరణంతో చిత్ర ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.

25 ఏళ్లుగా సినీ పరిశ్రమతో అనుబంధం

25 ఏళ్లుగా సినీ పరిశ్రమతో అనుబంధం

కమలాకర్ రెడ్డి గత 25 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో డిస్టిబ్యూటర్‌గా, ఎగ్జిబ్యూటర్‌గా సేవలందించారు. అర్జున్ రెడ్డితోపాటు పలు చిత్రాలకు సహా నిర్మాతగా కూడా పనిచేశారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, డిస్నీ వార్నర్ బ్రదర్స్, సోనీ పిక్చర్స్‌ రూపొందించిన చిత్రాలకు డిస్టిబ్యూటర్‌గా పనిచేశారు. అర్జున్‌రెడ్డి, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, కనులు కనులు దోచాయంటే లాంటి చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

బాలీవుడ్ నిర్మాత సంతాపం

బాలీవుడ్ నిర్మాత సంతాపం

కమలాకర్ రెడ్డి మరణం వార్తను బాలీవుడ్ నిర్మాత ముఖేష్ రాతీలాల్ మెహతా తెలియజేశారు. నా క్లోజ్ ఫ్రెండ్, నిజాయితీ, మానవత్వ విలువలు కలిగిన వ్యక్తి కమలాకర్ రెడ్డి మరణ వార్తతో విషాదంలో మునిగిపోయాను. కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మించి, డిస్ట్రిబ్యూషన్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం బాధకారం అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X