మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి దర్శకుడు.. నమ్రత సలహాతో..
అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవడమే కాకుండా ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఆ తరువాత అతను మళ్ళీ టాలీవుడ్ లో వర్క్ చేయలేదు. గత కొన్నేళ్లుగా అతని సెకండ్ తెలుగు మూవీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. ఇక మొత్తానికి మహేష్ సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

మహేష్ పిలవడంతో
విజయ్ దేవరకొండతో చేసిన అర్జున్ రెడ్డి సినిమా 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత మరో బాక్సాఫీస్ కొట్టేలా మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అని టాక్ గట్టిగానే వచ్చింది. ఎందుకంటే సినిమా హిట్టవ్వగానే మొదట అతనికి మహేష్ నుంచి పిలుపు వచ్చింది.

రెగ్యులర్ గా కలుసుకోవడంతో
అర్జున్ రెడ్డి సినిమాకు ఫిదా అయిన మహేష్ బాబు ఆ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. మహేష్ ఎంతగా ఇష్టపడ్డాడో ఒక్క ట్వీట్ తోనే చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. ఆ తరువాత మహేష్ సందీప్ ను రెగ్యులర్ గా కలుసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

బాలీవుడ్ లో మరో సినిమా
అయితే చర్చలు జరిగి మూడేళ్లు గడిచినా ఇంకా సినిమా రాకపోవడంతో మహేష్ ఆలోచన మారినట్లు రూమర్స్ వచ్చాయి. ఇక అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్టు కొట్టిన సందీప్ నెక్స్ట్ సినిమాను కూడా బాలీవుడ్ లోనే చేస్తున్నాడు. ఇక మహేష్ తో సినిమా అసలు ఉంటుందా లేదా అనే విషయంలో మొత్తనికి దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చాడు.
Recommended Video

భవిష్యత్తులో తప్పకుండా
ఇటీవల ఒక యాడ్ షూట్ కోసం సందీప్ తో కలిసి మహేష్ వర్క్ చేశాడు. ఇక మహేష్ బాబుతో సినిమా గురించి కూడా చర్చలు జరిగాయట. ఇక మహేష్ భార్య నమ్రత కూడా ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సరైన స్క్రిప్ట్ ఉంటే చెప్పు మహేష్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని సందీప్ కు చెప్పారట. ఆ విషయాన్ని సందీప్ మీడియాకు వివరించాడు. అయితే ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుందో చెప్పలేనని అంటూ భవిష్యత్తులో తప్పకుండా ఎదో ఒకరోజు సినిమా కోసం ఇద్దరం కలుస్తామని సందీప్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











