ప్లాన్ చేంజ్ చేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. మరో కొత్త కథతో..
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మళ్ళీ తెలుగులోనే మరో సినిమా చేస్తాడు అనుకుంటే బాలీవుడ్ సైడ్ వెళ్లి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ హిందీలో భారీ వసూళ్లు సాదించడంతో మనోడి పేరు ఒక్కసారిగా మరో రేంజ్ కి వెళ్లింది.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. నెక్స్ట్ కూడా మరో బాలీవుడ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూసిన సందీప్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు కాబట్టి సినిమాల కంటే కూడా వెబ్ కంటెంట్ తో క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఒక స్టార్ హీరోయిన్ తో అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సంస్థతో కలిసి వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ లో కొన్ని కథలను రాసుకున్న సందీప్ వెబ్ కంటెంట్ ని కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ప్రాజెక్టును కరోనా తీవ్రత తగ్గిన వెంటనే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అలాగే తన శిష్యులతో కూడా కొత్త తరహా సినిమాలను నిర్మించాలని ఈ బోల్డ్ డైరెక్టర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











