అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ పెళ్లి.. వధువు ఎవరంటే..
అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, చిలసౌ లాంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకొన్న రాహుల్ రామకృష్ణన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాను పెళ్లి చేసుకొంటున్నానని సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. కానీ వధువు ఎవరనే విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు. ఆయన ట్వీట్ ఇదే..
జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మీరు ఎవరికీ చెప్పొందు. చాలా సీరియస్ విషయం అని ట్వీట్ చేశారు. తన ప్రియురాలికి ప్రపోజ్ చేస్తున్న ఫొటోను రాహుల్ రామకృష్ణన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతోపాటు పలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.
రాహుల్ రామకృష్ణన్ పెళ్లి సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.

rahul ramakrishna rahul ramakrishna wedding arjun reddy bharat ane nenu రాహుల్ రామకృష్ణ రాహుల్ రామకృష్ణ పెళ్లి అర్జున్ రెడ్డి భరత్ అనే నేను


Click it and Unblock the Notifications