విజయ్ దేవరకొండను అలా ముద్దుపెట్టుకొన్నా.. షాలిని పాండే తొలి ముద్దు అనుభవం
Recommended Video

అర్జున్‌రెడ్డి చిత్రంలో అద్భుతమైన అభినయంతో షాలిని పాండే ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆ చిత్రంలో షాలిని పాండే తెలుగు ప్రేక్షకులతోపాటు, సినీ విమర్శకులకు మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్ చిత్రం తమిళ రీమేక్‌తోపాటు, మహానటి చిత్రంలో నటిస్తున్నది. ఈ నేపథ్యంలో షాలిని పాండే ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ ముద్దుల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు.

అర్జున్‌రెడ్డి తర్వాత సెలెక్టివ్‌గా
అర్జున్‌రెడ్డి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకొంటున్నాను. కథ, క్యారెక్టర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది అనుకొంటేనే నేను సినిమాలను అంగీకరిస్తున్నాను అని షాలిని పాండే తెలిపారు.

లిప్‌లాక్‌కు ప్రాధాన్యం లేదు
నా దృష్టిలో లిప్‌లాక్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఏడుపు, నవ్వు లాంటిదే ముద్దు. పాత్రకు అవసరమైతే లిప్‌లాకే కాదు.. బికినీ ధరించడానికి కూడా సిద్ధమే అని షాలిని పాండే అన్నారు. పాత్ర కోసం దేనికైనా సిద్ధమే అని అన్నారు.

హీరో విజయ్ దేవరకొండతో ముద్దు
అర్జున్‌రెడ్డికి ముందు నేను ఎవరినీ ముద్దు పెట్టుకొలేదు. ఎవరితో ప్రేమలో పడలేదు. సినిమా కోసం కేవలం విజయ్ దేవరకొండను ముద్దుపెట్టుకొన్నాను అని తొలి ముద్దు అనుభవాన్ని షాలిని పాండే వెల్లడించారు.

మహానటి చిత్రంలో షాలిని పాండే
ప్రస్తుతం తెలుగులో మహానటి చిత్రంలో షాలిని పాండే నటిస్తున్నది. ఈ చిత్రం ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











