For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ల్యాప్‌టాపుల్లో అర్జున్ రెడ్డి హల్‌చల్.. అలహాబాద్‌లో విజయ్ ఫీవర్!

    By Rajababu
    |
    ల్యాప్‌టాపుల్లో అర్జున్ రెడ్డి హల్‌చల్.. అల‌హాబాద్‌లోని ఐఐఐటీ విద్యార్దులు కూడా !

    ఇటీవల కాలంలో దక్షిణాదిలో సంచలనం రేపిన చిత్రం అర్జున్ రెడ్డి. యువ హీరో, దర్శకులు విజయ్ దేవర కొండ, సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకుపోతున్నది. తాజాగా ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో విడుదల చేయగా నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వీడియోను హీరో విజయ్ షేర్ చేయగా అంది వైరల్‌గా మారింది.

    50 రోజులు పూర్తి

    50 రోజులు పూర్తి

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్నది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అర్జున్ రెడ్డి మూవీని ఆన్ లైన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ సైట్‌లో రిలీజ్ చేశారు.

    తొలగించిన సన్నివేశాలు కూడా

    తొలగించిన సన్నివేశాలు కూడా

    అర్జున్ రెడ్డి చిత్రంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపి తొలగించిన సన్నివేశాలను కూడా జోడించి విడుదల చేయడంతో స్టూడెంట్స్, నెటిజన్ల నుంచి అనూహ్య స్స్పందన వస్తున్నది.

    అలహాబాద్ ఐఐఐటీలో..

    అలహాబాద్ ఐఐఐటీలో..

    దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో తెలుగు వెర్షన్‌ను చూసి ఆనందిస్తున్న అల‌హాబాద్‌లోని ఐఐఐటీ విద్యార్దుల వీడియోను విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. ఐటీ విద్యార్థులందరూ త‌మ హాస్టల్ గ‌దిలోని ల్యాప్ ట్యాప్‌ల్లో అర్జున్ రెడ్డి సినిమా చూస్తూ క‌నిపించారు.

    వీడియోను షేర్ చేసిన విజయ్

    అలహాబాద్ హాస్టల్స్‌లోని విద్యార్థులు చూస్తున్న వీడియోని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. త‌న సినిమాకి అంద‌రూ ఔట్ అయిపోయారని కామెంట్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    మద్యానికి బానిసైన పాత్రలో

    మద్యానికి బానిసైన పాత్రలో

    అర్జున్ రెడ్డి చిత్రంలోప్రేయసికి దూరమై మద్యానికి బానిసైన మెడికల్ విద్యార్థి పాత్రలో విజయ్ అద్భుతంగా నటించాడు. విజయ్ దేవరకొండ నటనకు రాంగోపాల్ వర్మ, ఇతర సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. దర్శక, హీరోలను పలువురు ప్రశంసించిన సంగతి తెలిసిందే.

    English summary
    Hero Vijay Devarakonda, Director Sandeep Reddy's Arjun Reddy completed 50 days in theatre. In this occasion, This movie was released in Amazon Prime with uncut version. In Alahabad IIIT campus student are watching this movie high number. That video was shared by Vijay Devarakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X