»   » అర్జున్ రెడ్డి హీరోయిన్ తీవ్ర అస్వస్థత ? మొహం కూడా కనిపించకుండా నిండా గుడ్డ కప్పి....

అర్జున్ రెడ్డి హీరోయిన్ తీవ్ర అస్వస్థత ? మొహం కూడా కనిపించకుండా నిండా గుడ్డ కప్పి....

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Arjun Reddy" Heroine Shalini Pandey In Hospital

అర్జున్‌రెడ్డి సినిమా హీరోయిన్ శాలినీ పాండే తీవ్రమైన అస్వస్థతకు గురైంది. నెల్లూరులో సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి బుధవారం వెళ్లిన ఆమె అక్కడ అస్వస్థతకు గురవడంతో దగ్గర్లోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

కిమ్స్ వైద్యులు ఆమెకు గంటపాటు చికిత్స అందించారు. అనంతరం ఆమెను స్ట్రైచర్‌పై తీసుకెళ్లి కారులో ఎక్కించి పంపించారు. స్ట్రైచర్‌పై తీసుకెళ్లే సమయంలో ఆమె శరీరం ఏ మాత్రం కనిపించకుండా ముఖంతో సహా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచడం గమనార్హం.

Arjun Reddy Heroine Shalini Pandey Hospitalised

ఓ సెల్ ఫోన్ షాపును ప్రారంభించడానికి శాలిని నెల్లూరు రాగా, కార్యక్రమం మధ్యలో ఆమె హఠాత్తుగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఆమెను లేపేందుకు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో, హుటాహుటిన బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు.

అంబులెన్స్ నుంచి సైతం దిగేందుకు ఆమె శరీరం సహకరించకపోవడంతో, స్టెచ్చర్ పై ఆమెను ఆసుపత్రి లోపలికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే ఆమె కోలుకున్న తర్వాత తాను క్షేమంగా ఉన్నాననీ, చిన్న అస్వస్తత మాత్రమే అని చెప్తూ తన ఫేస్బుక్ లో ఇంకో వీడియో పోస్ట్ చేసింది.

English summary
Arjun Reddy movie heroine Shalini Pandey treated by Nellore hospital doctors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu