twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5రోజుల్లోనే పవన్ రికార్డు స్మాష్: అర్జున్ రెడ్డి ప్రభావం మామూలుగా లేదుగా

    రిలీజ్ ముందు యాంటీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులతో సంచలనంగా మారింది. 224 థియేటర్లతో పవన్ కళ్యాన్ రికార్డు 89 థియేటల తో బద్దలు కొట్టాడు విజయ్ దేవ

    |

    Recommended Video

    "Arjun reddy" Movie Crossed Pawan Kalyan's Record

    విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఓవర్సీస్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. తన రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

    యాంటీ ప్రమోషన్స్ తో

    యాంటీ ప్రమోషన్స్ తో

    రిలీజ్ ముందు యాంటీ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన ఈ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులతో సంచలనంగా మారింది. చూస్తుంటే ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుండగా టోటల్ రన్ లో సినిమా 30 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.యూఎస్ లో ఈ సినిమాకు ఎలాంటి కత్తెరలు పడలేదు. ఇక ఇలాంటి సినిమాలకు యూఎస్ లో ఈ రేంజ్ లో సక్సెస్ అవడం గొప్ప విషయం.

    బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు

    బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు

    మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ యూఎస్ లో 7 లక్షల డాలర్లు వసూలు చేసింది. అర్జున్ రెడ్డి మూడు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. విజయ్ నటించిన పెళ్లిచూపులు సినిమా కూడా యూఎస్ లో 50 రోజులు ఆడించారంటే ఇక అక్కడ విజయ్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

    ఓవర్సీస్‌లో అర్జున్‌రెడ్డి

    ఓవర్సీస్‌లో అర్జున్‌రెడ్డి

    అయితే విడుదలయి వారం రోజులు కూడా కాకముందే ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అర్జున్‌రెడ్డి సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసింది.

    89 థియేటర్లో అమెరికాలో

    89 థియేటర్లో అమెరికాలో

    మొత్తం 89 థియేటర్లో అమెరికాలో విడుదలయిన ఈ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే.. అంటే మంగళవారం నాటికి 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను కలెక్ట్ చేసింది. ఇంత తక్కువ థియేటర్లలో విడుదలయినా అతి తక్కువ సమయంలోనే ఒక మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు విడుదలయిన ఏ సినిమాలు కూడా ఈ అరుదైన ఫీట్‌ను సాధించలేకపోయాయి.

    134 స్క్రీన్లలో ఫిదా

    134 స్క్రీన్లలో ఫిదా

    వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా సినిమా కూడా అయిదు రోజుల్లోనే అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటినా.. థియేటర్ల సంఖ్య మాత్రం అర్జున్‌రెడ్డి కంటే ఎక్కువే. దాదాపు 134 స్క్రీన్లలో ఫిదా సినిమా అమెరికాలో విడుదలయింది. నాని నిన్నుకోరి సినిమా 139 థియేటర్లలో విడుదలయి 9 రోజుల్లో మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టగా.. అల్లు అర్జున్ ‘డీజే' 162 థియేటర్లలో 9 రోజుల్లో మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది.

    కాటమరాయుడు సినిమా 224 థియేటర్లలో

    కాటమరాయుడు సినిమా 224 థియేటర్లలో

    ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా 163 స్క్రీన్లలో ఆరు రోజుల్లో ఈ రికార్డును నమోదు చేయగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా 224 థియేటర్లలో విడుదలయి ఒక మిలియన్ డాలర్ల మార్కును అయిదు రోజుల్లో చేరుకుంది.

    మరో 25 థియేటర్లలో

    మరో 25 థియేటర్లలో

    మొత్తానికి అత్యంత తక్కువ థియేటర్లలో విడుదలయి తక్కువ సమయంలో మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాగా అర్జున్ రెడ్డి నిలిచిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కాగా ఈ గురువారం నుంచి అమెరికాలో మరో 25 థియేటర్లలో అర్జున్‌రెడ్డి సినిమా సందడి చేయబోతోంది.

    English summary
    The film Arjun Reddy is turning out to be a goldmine for buyers in the overseas. The US collections, especially have been spectacular. The movie has now crossed million dollar mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X