»   » పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, కేటీఆర్ ఏంటిది? ‘అర్జున్ రెడ్డి’ని ఆపండి: వీహెచ్

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్, కేటీఆర్ ఏంటిది? ‘అర్జున్ రెడ్డి’ని ఆపండి: వీహెచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Arjun Reddy Kissing Poster Trolls

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమాపై విడుదల ముందు నుండే కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆర్టీసీ బస్సులపై వేసిన ముద్దు సీన్ పోస్టర్లను ఆయన చించేశారు.

అడల్ట్ కంటెంటుతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆయన గతంలో సెన్సార్ బోర్డు వద్ద కూడా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా విడుదలైన తర్వాత ఆయన మరోసారి ఆందోళన చేపట్టారు.

యువత చెడిపోతున్నారు

యువత చెడిపోతున్నారు

‘అర్జున్ రెడ్డి' సినిమా చూసి యువత చెడిపోతున్నారని, వెంటనే ఈ సినిమాను నిలిపి వేయాలని, ఈ సినిమా వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు మండి పడ్డారు.

అభ్యంతరకర సీన్లు

అభ్యంతరకర సీన్లు

‘అర్జున్ రెడ్డి' చిత్రంలో విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం చూపించారు. ర్యాగింగ్ చేసి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేసిన సీన్లు ఉన్నాయి. ఇలాంటి అభ్యంతరకర సీన్లు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల యువత చెడిపోతుందని విహెచ్ ఆనందోళన వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఏంటిది?

కేటీఆర్ ఏంటిది?

‘అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలను తప్పుబట్టడం పోయి... మంత్రి కేటీఆర్ లాంటి వారు సినిమాను సపోర్టు చేస్తూ కామెంట్స్ చేయడం ఏమిటి? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అని వీహెచ్ ప్రశ్నించారు.

సెన్సార్ బోర్డుకు, సీపీకి కంప్లయింట్

సెన్సార్ బోర్డుకు, సీపీకి కంప్లయింట్

‘అర్జున్ రెడ్డి' సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన సెన్సార్ బోర్డుకు, నగర పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగి ఈ సినిమాపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

English summary
Congress Party leader V Hanumantha Rao have demanded to delete the vulgar scenes being projected in the Arjun Reddy Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu