Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్: డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ‘పెళ్లి చూపులు’ స్టార్
అర్జున్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై అంచనాలు పెరిగాయి.
'పెళ్లి చూపులు' సినిమా ద్వారా తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ త్వరలో 'అర్జన్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలవుతోంది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ద్వారా హీరో విజయ్‌లోని కొత్త కోణాన్ని దర్శకుడు సందీప్ వంగ ఆవిష్కరించినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించబతున్నాడు. కోపాన్ని నియంత్రించుకోలేని వ్యక్తిగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా మాట్లాడుతూ.. "హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ-షాలినిలు అందించిన సపోర్ట్ తోనే హైద్రాబాద్, డెహ్రాడూన్, మంగళూరు, న్యూడిల్లీ మరియు ఇటలీ వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయగలిగాం. ఇంటెన్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న అర్జున్ రెడ్డి చిత్రాన్ని నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 25న విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఎగ్జిక్యూషన్-కెమెరా వర్క్-సౌండ్ డిజైన్ "అర్జున్ రెడ్డి" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి" అన్నారు.
విజయ్ దేవర కొండ, షాలిని, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, కాంచన ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజకృష్ణన్, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్.ఎక్స్ః హరికృష్ణ, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కృష్ణ వడ్డేపల్లి, మ్యూజిక్ః రధన్, కెమెరాః రాజ్ తోట, ఎడిటింగ్ః శశాంక్, నిర్మాతః ప్రణయ్ వంగా, రచన, దర్శకత్వంః సందీప్‌రెడ్డి వంగా.