ముదురుతున్న 'అర్జున్ రెడ్డి' వివాదం.. డైరెక్టర్ వార్నింగ్

Recommended Video

Director Bala Sends Legal Notice To The Makers Of Adithya Varma || Filmibeat Telugu

తెలుగులో చిన్న సినిమాగా రిలీజైన 'అర్జున్ రెడ్డి' ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించి టాలీవుడ్ సినిమాల్లోకెల్లా ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. అయితే 'అర్జున్ రెడ్డి' విడుదలకు ముందే ఈ సినిమాపై పలు వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మితిమీరిన ముద్దు సీన్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వెంటనే ఈ సినిమాను నిలిపివేయాల్సిందే అని ఆ సమయంలో రాజకీయవేత్త వీహెచ్ పెద్ద హంగామా చేశారు. అవన్నీ దాటుకొని థియేటర్స్ లోకి వచ్చిన అర్జున్ రెడ్డి చివరకు ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు మరోసారి ఇంకో రూపంలో అర్జున్ రెడ్డి వివాదం తెరపైకి రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దామా..

అర్జున్ రెడ్డి రీమేక్

అర్జున్ రెడ్డి రీమేక్

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా అందించిన విజయం ఇతర భాషా దర్శకనిర్మాతల మనసు దోచేసింది. దీంతో వెంటనే ఈ సినిమాను తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత ఈ రెండు భాషల్లో అర్జున్ రెడ్డి రీమేక్ సెట్స్ పైకి కూడా వచ్చేసింది.

ఆదిత్య వ‌ర్మ‌, కబీర్ సింగ్ పేర్లతో

ఆదిత్య వ‌ర్మ‌, కబీర్ సింగ్ పేర్లతో

తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాను ఆదిత్య వ‌ర్మ‌ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక హిందీలో అయితే సందీప్ రెడ్డి వంగానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ కబీర్ సింగ్ పేరుతో సినిమా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

నిర్మాతల అసంతృప్తి

నిర్మాతల అసంతృప్తి

హిందీ అర్జున్ రెడ్డికి ప్రాబ్లెమ్ రానప్పటికీ.. తమిళ అర్జున్ రెడ్డి సినిమా మాత్రం పలు వివాదాల్లో ఇరుక్కుపోయింది. తమిళ దర్శకుడు బాలా ద‌ర్శ‌క‌త్వంలో మొదలైన ఈ సినిమా ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఫ‌స్ట్ కాపీపై నిర్మాత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేసి హీరోను త‌ప్ప టోట‌ల్ యూనిట్‌ను మార్చేసి కొత్త దర్శ‌కుడితో సినిమాను రీ షూట్ చేయడంతో ఆదిత్య వర్మ అలా ఆగిపోయింది.

అదే జరిగితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు

అదే జరిగితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు

కాగా ఆదిత్య వర్మ రీ షూట్ పూర్తి చేయడానికి కేవలం 50 రోజులు మాత్రమే పట్టింది. ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో
గత దర్శకుడు బాలా ఓ మెలిక పెట్టారు. తాను ముందుగా డైరెక్ట్ చేసిన ఔట్‌పుట్ నుండి సింగిల్ షాట్ కూడా వాడ‌టానికి వీలులేద‌ని, ఒకవేళ అదే జరిగితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరికలు జారీ చేశారు. చూడాలి మరి చివరకు ఏం జరగనుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X