విఘ్నాలన్నీ దాటిన ‘అర్జున్ రెడ్డి’.. విడుదలకు సిద్ధం

తెలుగు సినీ ఇండస్ట్రీలో 'అర్జున్ రెడ్డి' చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను ఈ సినిమా చెరిపివేసింది. దీన్ని ప్రేక్షకులు కూడా ఆదరించడంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాను తమ తమ భాషల్లో విడుదల చేయడానికి చాలా ఇండస్ట్రీల నుంచి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఈ సినిమాను హిందీతో పాటు తమిళ రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయి. ఇవి కూడా భారీ ధరకు సేల్ అవడం చర్చనీయాంశం అయ్యాయి.

హిందీలో షాహీద్ కపూర్ - కియారా అద్వాణీ జంటగా నటించిన 'కబీర్ సింగ్'ను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటికే 'కబీర్ సింగ్' భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో స్థానం కూడా సంపాదించుకుంది. ఇప్పటికే 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ. 250 కోట్లు పైగా వసూళ్లు సాధించింది.

Arjun reddy Tamil Remake Adithya Varma Ready For Release

ఇక, తమిళం విషయానికొస్తే.. ఈ సినిమాను చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ చేస్తున్నాడు. ఈ సినిమాను మొదట సీనియర్ డైరెక్టర్ బాలా తెరకెక్కిస్తాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఆయనను మధ్యలోనే తప్పించారు. తర్వాత గిరీశయ్య అనే దర్శకుడు ఈ చిత్రాన్ని కొత్తగా మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇందులో బానిత సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ధృవ్ ఎలా నటించాడు అన్నది ఆసక్తికరంగా మారింది. టీజర్ అయితే, అచ్చం 'అర్జున్ రెడ్డి' లాగే కనిపించడంతో మిగిలిన సినిమా కూడా అలాగే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం తమ నేటివిటీకి తగినట్లు కొన్ని మార్పులు చేశామని చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X