»   » బూతు సినిమా అని ముద్ర వేసినా.... రేటింగ్ అదుర్స్!

బూతు సినిమా అని ముద్ర వేసినా.... రేటింగ్ అదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

2017 సంవత్సరంలో టాలీవుడ్లో బాగా హైలెట్ అయిన సినిమా, వివాదాస్పదం అయిన సినిమా ఏది అంటే..... అందరూ తడుముకోకుండా చెప్పే పేరు 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రంలో మితిమీరిన శృంగార దృశ్యాలు, ముద్దు సీన్లు, బూతు పదజాలం వాడటంతో వి. హనుమంతరావుతో పాటు కొందరు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఆందోళన చేయడం, వారి విమర్శలకు విజయ్ దేవరకొండ 'కూల్ తాత' అంటూ ఫన్నీగా కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

టీవీలో కూడా సూపర్ సక్సెస్

టీవీలో కూడా సూపర్ సక్సెస్

అర్జున్ రెడ్డి సినిమాను ఇటీవల మాటీవీలో వేశారు. ఈ చిత్రానికి టీవీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై బూతు ముద్ర పడినా 13.6 టీఆర్పీ రేటింగ్ సాధించింది.

'Arjun Reddy' Remake In Multiples Languages
 ఆ సీన్లన్నీ లేపేశారు

ఆ సీన్లన్నీ లేపేశారు

అయితే థియేటర్ ప్రింటుతో పోలిస్తు టీవీ ప్రీమియర్లో చాలా సీన్లు లేపేశారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ముద్దు సీన్లు, బూతు డైలాగులు, శృంగార సన్నివేశాలను లేపేశారు.

ఆ రెండు కారణాలే...

ఆ రెండు కారణాలే...

టీవీలో కూడా ఈ చిత్రం సక్సెస్ రేటింగ్ సాధించడానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఇది బోల్డ్‌గా తీసిన సినిమా కావడం, ఆకట్టుకునే లవ్ స్టోరీ ఉండటంతో పాటు...... అప్పట్లో థియేటర్ వరకు వెళ్లి చూడని ఫ్యామిలీస్ అంతా ఈ చిత్రాన్ని టీవీలో చూశారు.

ఆ చిత్రాలకంటే బెటరే

ఆ చిత్రాలకంటే బెటరే

సంక్రాంతికి టీవీలో మహేష్ బాబు స్పైడర్, శర్వానంద్ మహానుభావుడు చిత్రాలు వేశారు. ఈ చిత్రాలకంటే ‘అర్జున్ రెడ్డి' మంచి రేటింగ్ సాధించింది.

 టాప్ రేటింగ్ వాటిదే

టాప్ రేటింగ్ వాటిదే

‘జై లవ కుశ' మూవీ సంక్రాంతికి టీవీలో ప్రదర్శించగా 17.7 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తారక్ కెరీర్లోనే ఇది సెకండ్ హయ్యెస్ట్ రేటింగ్. ‘జై లవ కుశ' చిత్రంతో సమానంగా ‘రాజా ది గ్రేట్' మూవీ కూడా 17.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఈ సంక్రాంతికి ఈ చిత్రాలే టాప్.

English summary
Arjun Reddy, the most controversial and bold Telugu movie of 2017, garnered a thumping response on TV too. The Vijay Deverakonda starrer got 13.6 TRP during its Television premiere.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu