రేపే రిలీజ్...ఓపినింగ్స్ ఎలా ఉంటాయో
హైదరాబాద్ : యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'జైహింద్ 2'. ఆయనే దర్శకత్వం వహించారు. సుర్విన్ చావ్లా, చార్లెట్ క్లారి హీరోయిన్స్ . ఈ చిత్రాన్ని రేపు (ఈనెల 7న) విడుదల చేయబోతున్నారు. చాలాకాలంగా హిట్ లేని అర్జున్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆయన సూపర్ హిట్ జెంటిల్ మెన్ రేంజిలో వర్కవుట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ చిత్రం విడుదల అవుతూండటంతో ఏ స్ధాయిలో ఓపినింగ్స్ ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకంటే ఓపినింగ్స్ ని బట్టే సినిమా టాక్ స్ప్రెడ్ అయ్యే రోజులు కాబట్టి.
అర్జున్ మాట్లాడుతూ ''విద్యావ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. చదువు పేదవారికి ఎందుకు భారమైపోతోంది, దానికి కారణం ఎవరు? అనే విషయాల్ని చర్చిస్తున్నాం. యాక్షన్ సన్నివేశాలన్నీ కొత్తగా ఉంటాయి. ఇదివరకెప్పుడూ ఇలాంటి పోరాట దృశ్యాల్ని చేయలేదు. సాంకేతికంగానూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. బ్రహ్మానందం, అలీలపై కొన్ని వినోదాత్మక సన్నివేశాల్ని తెరకెక్కించాం. అవి అందరినీ అలరిస్తాయి. అర్జున్ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం ప్రధాన బలం'' అన్నారు.

అర్జున్ దర్శకత్వంలో 1993లో వచ్చిన చిత్రం ‘జైహింద్'. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అదే పేరుతో అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘జైహింద్-2'. భారీ టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెకిస్తున్నారు.
అర్జున్ ఈ సినిమాని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాంకి అంకితం ఇస్తున్నానని తెలిపాడు. ‘ ఈ సినిమాని డా అబ్దుల్ కలాం గారికి అంకితం ఇస్తున్నాను. ఆయన రాసిన ఓ ఆర్టికల్ చూసి ఈ సినిమా చేస్తున్నానని' అర్జున్ అన్నాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ భాధ్యతలతో పాటు నిర్మాణ భాద్యత కూడా అర్జున్ తీసుకోవడం చెప్పదగిన విషయం.
అర్జున్, సుర్విన్‌చావ్లా, స్కార్లెట్, బ్రహ్మానందం, రఘుబాబు, షఫి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజేంద్రకుమార్, పాటలు: అనంత్ శ్రీరామ్, సంగీతం: హరికృష్ణ, కెమెరా: వేణుగోపాల్, ఎడిటింగ్:కె.ఆర్, సహ నిర్మాతలు: ఐశ్వర్య, అంజన, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్.


Click it and Unblock the Notifications











