Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలుగు తెరపైకి మరో స్టార్ హీరో వారసురాలు.. అది కూడా! అంతా సిద్ధం
టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల హంగామా నడుస్తోంది. స్టార్ హీరోల వారసులు వరుసపెట్టి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి, నందమూరి ఫ్యామిలీ నుంచి అలాగే అక్కినేని కుటుంబం నుంచి వారసులు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కుమారులే కాదు కూతుళ్లను కూడా సినిమాల్లోకి తీసుకొస్తాం అంటూ సీనియర్ హీరో రాజశేఖర్, కమల్ హాసన్ వారి వారి కుమార్తెలను రంగంలోకి దించారు. ఇప్పుడు అదే బాటలో యాక్షన్ కింగ్ అర్జున్ వెళ్తున్నారు.
అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఇకపై తెలుగు ప్రేక్షకులనూ అలరించబోతోంది. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అంతా సిద్ధం చేశారు హీరో అర్జున్.
'మా పల్లెలో గోపాలుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ సక్సెస్‌పుల్ చిత్రాలతో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన అర్జున్.. ఇక తన కూతురిని కూడా రంగంలోకి దించుతున్నారు.
నేడు (ఫిబ్రవరి 10) అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఐశ్వర్య అర్జున్ను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు అర్జున్. తన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాతో అర్జున్, తన కూతురిని పరిచయం చేయనుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.