మీకు టీఆర్పీ పిచ్చి పట్టింది: సంచలనం రేపుతున్న హీరో నిఖిల్ మూవీ టీజర్!
నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'అర్జున్ సురవరం'. గతంలో 'ముద్ర' అనే టైటిల్ ఉండగా పలు కారణాలతో 'అర్జున్ సురవరం'గా మార్చారు. టిఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
ఈ చిత్రంలో నిఖిల్.. బీబీసీ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఒక కీలకమైన కేసు చుట్టూ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ముఖ్యంగా ఇప్పటి మీడియా తీరును ఎండగడుతూ ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఇంట్రడక్షన్ అదుర్స్
ఒక అబద్దాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కానీ ఒక నిజాన్ని నిజం అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్ లెనిన్ సురవరం. జనాలకు నిజం చెప్పడం నా ప్రొఫెషన్... అంటూ టీజర్లో నిఖిల్ ఇంట్రడక్షన్ అదిరిపోయే విధంగా ఉంది.

మీకు టీఆర్పీ పిచ్చి పట్టుకుంది
అందరికీ టీఆర్పీ పిచ్చి పట్టింది. న్యూస్ అమ్మడం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు... అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నట్లు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జోరందుకున్న ప్రమోషన్స్
‘అర్జున్ సురవరం' చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. త్వరలో సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో హిట్ అయిన కనితన్ మూవీకి ఇది రీమేక్.
అర్జున్ సురవనం
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బి మధు సమర్పణలో ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











