యాక్షన్ కింగ్ అర్జున్ 'వాయుపుత్ర' గా మారే రోజు...
అర్జున్ హీరోగా రూపొందిన 'వాయుపుత్ర' చిత్రం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రం తమిళంలో 'వల్లకోట్టై' పేరుతో రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి హీరో అర్జున్ మాట్లాడుతూ "దర్శకుడు వెంకటేష్‌తో ఇది నా మూడో సినిమా. గతంలో చేసిన రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. ఇది పూర్తి వైవిధ్యంగా ఉన్న సినిమా. ప్రేక్షకులు ఆశించే యాక్షన్‌తో పాటు అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి" అని అన్నారు. భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ పతాకంపై ఎం.భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని తెలుగుకి అందిస్తున్నారు. హరిప్రియ, లత, ఆశిష్ విద్యార్థి, సురేష్ ఇతర కీలక పాత్రధారులు. మాటలు: ఘంటసాల రత్నకుమార్, సంగీతం: దిన, కెమెరా: ఆంజనేయులు, ఫైట్స్: దినేష్ దళపతి, కూర్పు: సురేందర్ రెడ్డి, సహ నిర్మాతలు: వి.వినయ్ రావు, ఎం.యుగంధర్.


Click it and Unblock the Notifications











