బ్రేకింగ్: అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఒక గొంతు నొక్కితే.. వేల గొంతులు లేస్తాయి.. కంగన రనౌత్ ఫైర్
రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్‌పై బాలీవుడ్ నటి కంగన రనౌత్ మండిపడ్డారు. నిజాలు నిక్కచ్చిగా బయటపెట్టే మీడియాపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పప్పు సేన, సోనియా సేన ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో కంగన చెప్పిన ప్రకారం..

సుశాంత్ సింగ్ మరణం కేసుపై
ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ మరణంపై ప్రత్యేక కథనాలు వెల్లడిస్తూ, ముంబై కమిషనర్ పరబ్‌జిత్ సింగ్‌ను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు లైవ్ కథనాలు వెల్లడించడం వివాదంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల అర్నబ్ గోస్వామికి ముంబై పోలీసులు, మహారాష్ట్ర అసెంబ్లీ సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన ఇంటిలోకి వెళ్లి అరెస్ట్ చేశారు.

ఇంటీరియర్ డిజైనర్ సూసైడ్ కేసే ప్రధానంగా
2018లో జరిగిన ఇంటీరియర్ డిజైనర్ అనయ్ నాయక్, ఆమె తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య ఘటన ప్రధానంగా అరెస్ట్‌కు కారణంగా ముంబై పోలీసులు చూపారు. తనకు రావాల్సిన రూ.5.40 కోట్ల రూపాయాలను సకాలంలో అర్నబ్ గోస్వామి, ఫీరోజ్ షేక్, నితీస్ సర్దా చెల్లించలేకపోవడం వల్ల ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాం. ఆ కారణంగానే తాము సూసైడ్ చేసుకొంటున్నామని అనయ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బుధవారం అర్నబ్‌ను అరెస్ట్ చేశారు.

అర్నబ్ గోస్వామి ఇంటిలోకి దూసుకెళ్లి
అర్నబ్ గోస్వామి ఇంటిలోకి దూసుకెళ్లి ఆయనపై దాడి చేసి.. జుట్టు లాగడంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగాలని అనుకొంటున్నాను. మీరు ఎన్ని ఇళ్లపై దాడుల చేస్తారు? ఇంకా ఎన్ని గొంతులు నొక్కుతారు? ఎంతమందిని వేధిస్తారు? ఎంత మంది నోళ్లు మూయిస్తారు? సోనియా సేన ఎన్నాళ్లు ఇలాంటి దారుణాలు చేస్తారు అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరెన్నో గొంతులు లేస్తాయి.
అన్యాయాలు, అక్రమాలపై సోనియా సేన నోరు మూయించాలని ప్రయత్నిస్తే మరిన్ని గొంతులు పైకి లేస్తాయి. ఇంతకు ముందు ఎంతో మంది దేశభక్తులు గొంతులు కోసారో తెలుసు. ఎంతో మంది కంఠాలకు ఉరితాళ్లు బిగించారు. అయినా మేము వెనుకడుగు వేయం. ఒక గొంతును మూయించాలని చూస్తే ఎన్నో గొంతులు లేస్తాయి అంటూ కంగన రనౌత్ ఫైర్ అయ్యారు.

మహారాష్ట్ర సర్కార్‌పై ధ్వజం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను, ఆయన కుమారుడిపై కంగన రనౌత్ తీవ్రమైన విమర్శలు చేశారు. పెంగ్విన్‌లా వ్యవహరిస్తే.. పెంగ్విన్ అనకుంటే ఏమనాలి? నీ తండ్రి పప్పు లాంటి పాలన చేస్తే.. పప్పుసేన అని అంటాం. సోనియా సేన అంటూ కోపం వస్తుందా? మరోసారి కచ్చితంగా మీరు సోనియా సేన అని నేను అంటాను అని కంగన రనౌత్ అన్నారు.


Click it and Unblock the Notifications











