twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ హౌస్‌లో సల్మాన్ ఖాన్...చెల్లి-బావ (ఫోటో)

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పిత ఖాన్ వివాహం ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ముంబైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ వివాహం జరిగింది. గత కొంత కాలంగా అర్పిత, ఆయుష్ ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది.

    కాగా....ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్...నూతన దంపతులను బిగ్ బాస్ హౌస్‌కు తీసుకెళ్లారు. కంటెస్టెంట్స్‌కు వారిని పరిచయం చేసారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, అర్పిత, ఆయుష్ కూడా రావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సంతోషం వ్యక్తం చేసారు. వారికి విషెస్ తెలిపారు.

    Arpita, Aayush visits Bigg Boss Sets

    హైదరాబాద్ తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్‌ శర్మతో అంగరంగ వైభవంగా అర్పిత వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం ముంబైలో అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అంతా పాల్గొన్నారు. దిలీప్ కుమార్, సైరా భాను, ఆశా పారఖ్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిసౌజా, గోవిందా, ఫర్హాన్ అక్తర్, వినోద్ ఖన్నా, శ్రద్ధా కపూర్, బాబీ డియోల్, లారాదత్తా, జాక్వెలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇద్దరూ కలిసి పలు బాలీవుడ్ సాంగుకుల డాన్స్ చేసారు. ఈ సంవత్సరం బాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ పార్టీ ఇదే అనే విధంగా ఈ వేడుక సాగింది.

    English summary
    Arpita Khan's wedding festivities had barely concluded, but that didn't stop her from paying a surprise visit to her beloved brother Salman Khan on the sets of his show Bigg Boss 8, a day after her Mumbai reception on November 21. Salman introduced the newly-weds to the thrilled contestants and and later escorted the couple out of the sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X