సల్మాన్ చెల్లి స్టోరీ: ఫుట్‌పాత్ టు ప్యాలెస్‌లో పెళ్లి వరకు!

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పితా ఖాన్ వివాహం హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఫలక్‌నుమా హోటల్‌‌లో కోట్లు ఖర్చు పెట్టి జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ మీకో విషయం తెలుసా? అర్పితా ఖాన్ సల్మాన్ సొంత చెల్లెలు కాదు. ఆమె దత్తత తీసుకున్న చెల్లెలు.

అర్పితా ఖాన్ నేపథ్యం, ఆమెను సల్మాన్ ఖాన్ కుటుంబం పెంచిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. అర్పితా ఖాన్....ఫుట్ పాత్‌పై యాక్సిడెంటులో మరణించిన ఓ మహిళ కూతురు. అమ్మ చనిపోవడంతో అనాదగా రోడ్డుపై పడి ఉన్న ఆమెను సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ తన ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే ఆమెను సలీమీ ఖాన్ ఫ్యామిలీ దత్తత తీసుకుంది.

అర్పితా ఖాన్‌పై సలీమ్ ఖాన్ ఫ్యామిలీ, సల్మాన్ సోదర త్రయం ఎంత ప్రేమ పెంచుకుంటన్నారంటే....ఆమెను ఇంట్లో యువరాణిలా చూసుకుంటారు. అర్పితా ఖాన్ చిన్నప్పటి నుండి తన వివాహం ప్యాలెస్‌లో జరుపుకోవాలని ఆశ పడేదట. ముద్దుల చెల్లిలి కోరిక తీర్చడంలో భాగంగానే సల్మాన్ ఖాన్ రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ ఫలక్ నుమ ప్యాలెస్ బుక్ చేసారు. అంతే కాకుండా ముంబైలోని కార్టర్ రోడ్డులో రూ. 16 కోట్ల విలువ చేసే 3 పడక గదులున్న ప్లాట్ కొనిచ్చాడు.

ఇల్లు లేక, దిక్కు మొక్కు లేక రోడ్డుపై ఉన్న ఒక బాలిక...ఇపుడు చారిత్రక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకునే ఆమె జీవితం సాగిందంటే....సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఆమెపై పెంచుకున్న వెలకట్టలేని ప్రేమే కారణమని చెప్పక తప్పదు. అర్పితా ఖాన్ లాంటి లక్కీ గర్ల్ ఈ ప్రపంచంలో మరెవరూ ఉండరేమో....అనేలా ఉంది కదూ ఆమె స్టోరీ.

అర్పితా ఖాన్

అర్పితా ఖాన్


రోడ్డు ప్రమాదంలో అమ్మ మరణించడంతో అనాదగా మారిన అర్పితా ఖాన్‌ను సలీమ్ ఖాన్ ఇంటికి తీసుకొచ్చి దత్తత తీసుకున్నారు.

అర్జున్ కపూర్‌తో అర్పితా డేటింగ్

అర్జున్ కపూర్‌తో అర్పితా డేటింగ్


గతంలో అర్పితా ఖాన్ అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది. అయితే కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు.

అర్పితా చదువు

అర్పితా చదువు


లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో చదివిన అర్పితా ఖాన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంటులో డిగ్రీ పొందింది.

వర్కింగ్

వర్కింగ్


ఆర్కటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగుపై అర్పితా ఖాన్ కొన్ని రోజులు ముంబైలో పని చేసింది.

ఆయుష్ బాలీవుడ్ డ్రీమ్

ఆయుష్ బాలీవుడ్ డ్రీమ్


అర్పితా ఖాన్‌కు సినిమాల్లోకి రావడంపై పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఆమెకు కాబోయే భర్త ఆయుష్ శర్మకు మాత్రం బాలీవుడ్లో హీరోగా నిలదొక్కుకోవాలనే ఆశతో ఉన్నాడు.

అర్పితా డ్రీమ్

అర్పితా డ్రీమ్


సొంతగా ఫ్యాషన్ బ్రాండ్ ప్రవేశ పెట్టాలని, సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టాలని అర్పితా ఖాన్ ఆశ పడుతోంది.

అర్పితా-ఆయుష్

అర్పితా-ఆయుష్


అర్పితా ఖాన్, ఆయుష్ శర్మ గత కొంత కాలం కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. 2013 నుండి వీరు డేటింగ్ చేస్తున్నారు.

వెడ్డింగ్ డేట్

వెడ్డింగ్ డేట్


వాస్తవానికి వీరు 2015లో వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే అదే ఏడాది సల్మాన్ తల్లిదండ్రులైన అలీమ్ ఖాన్-సల్మా ఖాన్ 50వ వెడ్డింగ్ యానివర్సరీ ఉండటంతో ఈ సంవత్సరం వీరి పెళ్లి డేట్ ఫిక్సయింది.

అర్పితా అంటే ఎంతో ప్రేమ

అర్పితా అంటే ఎంతో ప్రేమ


సల్మాన్ కుటుంబ సభ్యులు అర్పితా ఖాన్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆమెను ఇంటో ప్రిన్సెస్‌లా ట్రీట్ చేస్తారు.

అర్పితా ఖాన్ వెడ్డింగ్

అర్పితా ఖాన్ వెడ్డింగ్


అర్పితా ఖాన్ వివాహం ఈ రోజు హైదాబాద్ లోని ఫలక్ నుమ ప్యాలెస్‌లో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X