కళ్యాణం, కమనీయం....(సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి ఫోటోస్)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పిత ఖాన్ వివాహం మంగళవారం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్ శర్మతో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వివాహానికి విచ్చేసిన అతిథుల కోసం హైదరాబాద్ స్పెషల్ వంటకాలు, ఉత్తరాది వంటలు చేయించారు.
బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరు కావడంతో కన్నుల విందుగా వివాహం జరిగింది. అమీర్‌ఖాన్ దంపతులు, కత్రినా కైఫ్, రితేష్ దేశ్‌ముఖ్, కరణ్ జోహార్, డేవిడ్ ధావన్, సుభాష్ ఘయ్, ప్రియాంక చోప్రా, మికాసింగ్, బాబా సెహగల్, వరుణ్ ధావన్, రాణీ ముఖర్జీ, జరీన్ ఖాన్, రణబీర్ కపూర్ తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్ నుండి ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు, టాలీవుడ్ ప్రముఖులు వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, రామ్‌చరణ్ తదితరులు హాజరయ్యారు. స్లైడ్ షోలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు...

అర్పిత ఖాన్-ఆయుష్ శర్మ
అర్పిత ఖాన్-ఆయుష్ శర్మ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లాడారు.

ముద్దుల చెల్లి
అర్పితా ఖాన్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి. ఆమె పెళ్లి కోసం సల్మాన్ ఖాన్ కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు పెట్టారు.

మతాంతర వివాహం
అర్పితా ఖాన్ ప్రేమించిన వ్యక్తి ఆయుష్ శర్మ హిందువు కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు.

గిఫ్టు
వివాహ కానుకగా ఈ దంపతులకు రూ. 16 కోట్ల విలువ చేసే ఫ్లాటును గిఫ్టుగా ఇచ్చాడు సల్మాన్.

తలపాగాతో సల్మాన్
హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరుగడంతో పెళ్లి వేడుకలో తలపాగా చుట్టుకుంటున్న సల్మాన్ ఖాన్.


Click it and Unblock the Notifications











