సల్మాన్ థాంక్స్: ప్రియుడితో ఘనంగా చెల్లి పెళ్లి (ఫోటోస్)
హైదరాబాద్: సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లితో హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ సందడిగా మారింది. సాయంత్రం 6గంటలు సల్మాన్ సోదకి అర్పితా ఖాన్ వివాహం ఆయుష్ శర్మతో జరిగింది. ఈ వివాహ వేడుక సందర్భంగా సల్మాన్ ఖాన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. తన సోదరికి విషెస్ తెలిపిన అందరికీ ట్విట్టర్ ద్వారా సల్మాన్ థాంక్స్ చెప్పారు.
హైదరాబాద్ లోని చారిత్రక ఫలక్ నుమ ప్యాలెస్ లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఫర్మానా, 6 గంటలకు వివాహం జరిగింది. 8 గంటలకు బారాత్ ఉంటాయని సల్మాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. వినోద కార్యక్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు మలైకా అరోరా ఖాన్ తదితరులు హాజరవుతున్నారు. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వరుడి తరుపున పురోహితుడు, వధువు తరుపున మత పెద్ద పాల్గొన్నట్లు సమాచారం.
ఈ పెళ్లి వేడుక కోసం ఫలక్ నుమ ప్యాలెస్ వాడుకున్నందుకుగాను రూ. 2 కోట్లు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా ముద్దుల చెల్లికి పెళ్లి కానుకగా రూ. 16 కోట్లు విలువ చేసే 3 బెడ్ రూం ఫ్లాట్ గిప్టుగా ఇస్తున్నాడు సల్మాన్ ఖాన్.
స్లైడ్ షోలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు...

మెహందీ
సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహ వేడుకలో మెహందీ కార్యక్రమం.

సంగీత్
సంగీత్ కార్యక్రమంలో అమృత అరోరాతోకలిసి అర్పిత ఖాన్.

సల్మాన్ ఖాన్
వివాహ వేడుకలో యాష్మిన్ కరాచీ వాలాతో కలిసి సల్మాన్ ఖాన్.

మలైకా అరోరా ఖాన్
ఫలక్ నుమా ప్యాలెస్ బయట సందడి చేసిన మలైకా అరోరా ఖాన్.

అర్జాజ్ ఖాన్ ఫ్యామిలీ
అర్బాజ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి వివాహ వేడుకలో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మలైకా, అమృత
స్నేహితులతో కలిసి వివాహ వేడుకలో మలైకా అరోరా ఖాన్, అమృత అరోరా.

భర్తతో కలిసి
భర్తతో కలిసి అమృత అరోరా ఖాన్ పెళ్లి వేడుకలో ఇలా ఫోటోలు ఫోజులు ఇచ్చారు.

ప్రియాంక చోప్రా
వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తల్లితో కలిసి హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక చోప్రా.

కాజల్
అర్పితా ఖాన్ వివాహ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కాజల్, ఆమె మదర్.

వరుడు ఆయుష్ శర్మ
అర్పితా ఖాన్‌ను పెళ్లాడబోయే వరుడు ఆయుష్ శర్మ ఇతడే. ఢిల్లీకి చెందిన ఆయుష్ గత కొన్నేళ్లుగా అర్పితతో డేటింగ్ చేస్తున్నాడు.

మలైకా అరోరా ఖాన్
మలైకా అరోరా ఖాన్ వివాహ వేడుకలో సందరడి చేసింది.

ప్యాలెస్ వద్ద...
ప్యాలెస్ లో అటూ ఇటూ తిరుగుతూ అర్పితా ఖాన్ సందడి చేసింది. మధ్యలో తెలుపు రంగు డ్రెస్సులో అర్పిత.

అర్బాజ్ ఖాన్...
కొడుకు అర్హాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ నటుడు, సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.

సల్మాన్ ఖాన్
సొహైల్ కాన్ కొడుకుతో కలిసి సల్మాన్ ఖాన్ ఇలా సెల్ఫీ...


Click it and Unblock the Notifications











