»   »  అరవింద్ 2 : హీరోయిన్ బొడ్డుపై వల్గర్ సీన్!?

అరవింద్ 2 : హీరోయిన్ బొడ్డుపై వల్గర్ సీన్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ, మాధవీలత, కమల్ కామరాజు, అవసరాల శ్రీనివాస్, అడోనిక ప్రధాన పాత్రధారులుగా శ్రీ విజయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'అరవింద్-2' చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ సూరి దర్శకత్వంలో జి.రవి నిర్మించారు. ఈచిత్రానికి సంబంధించిన ఓ ప్రచార పోస్టర్ ఇప్పుడ సర్వత్రా చర్చనీయంశం అయింది.

Aravind-2

కమల్ కమరాజు ఇందులో హీరోయిన్ బొడ్డు దగ్గర తన పెదాలతో టచ్ చేసే స్టిల్స్ మార్కెట్లోకి వదిలారు. హాట్ గా ఉన్న ఈ సీన్ చూపించి ప్రేక్షకులను థియేటర్లకు లాగాలనే ఉద్దేశ్యంతో దర్శక నిర్మాతలు చేసిన చీప్ ట్రిక్ ఇది. అయితే ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ పోస్టర్ పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాల్లో ఇలాంటి సీన్లు ఇప్పుడు కామనే అయినా...కొందరు మాత్రం ఈ సీన్ వల్గర్ గా ఉందని, ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమా చూసే విధంగా లేదని అభిప్రాయ పడుతున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు ఇటీవల వివరిస్తూ వివరిస్తూ... సైకో ఎవరోచూపించకుండానే గత చిత్రాలు నడిచాయని, సైకో ఎవరో చూపించి మరీ ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్‌గా ఓ సరికొత్త ప్రయోగంగా నిర్మించామని తెలిపారు. ఎ ఫిలిం బై అరవింద్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించినఈ చిత్రం ఇలాంటి కథలు ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.

నిర్మాత ఇలాంటి చిత్రం తీద్దాం అనడంతో మొదట అనుకోకపోయినా పార్ట్ 2 తీసామని, రియలిస్టిక్ చిత్రమని తెలిపారు. సైకో పాత్ కిల్లింగ్ సినిమాలలో ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించేలా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. దాండేలి అడవులు, గోవా తదితర ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రాన్ని గ్లామర్, రొమాన్స్, థ్రిల్లర్‌గా నిర్మించామని నిర్మాత రవి తెలిపారు. రీ రికార్డింగ్ భయపెడుతుందని, విజయ్ కూరాకుల సంగీతం అద్భుతంగా వచ్చిందని ఆయనతెలిపారు.

English summary
Aravind 2 is a 2013 Telugu film Directed by Sekhar Suri starring Sri, Madhavi Latha, Kamal Kamaraju, Srinivas Avasarala and Adonica in the Lead. G. Phanindra and G. Vijay Choudary produced this film on Sri Vijayabheri Productions Banner while Vijay Kurakula provided the music. The Movie is scheduled for a release in March 29, 2013.
Please Wait while comments are loading...