twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో పాపం... అరెస్ట్ అయ్యే పరిస్థితిలో నిర్మాత బెల్లంకొండ? ఈ తప్పు ఎవరిది?

    |

    Recommended Video

    Court Issues Arrest Warrant Against Bellamkonda Suresh || Filmibeat Telugu

    తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన బెల్లంకొండ సురేష్ గురించిన ఓ విషయం తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆయన తెలిసి చేశారో? తెలియక చేశారో? ఓ కేసు చివరకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే వరకు తీసుకెళ్లింది.

    అయితే ఈ కేసు పూర్వా పరాలు పరిశీలిస్తే దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ దీన్ని మొదలు పెట్టాలి. అక్కడ మొదలైన కథ అనేక మలుపులు తిరిగి బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే వరకు వచ్చింది.

    బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ ఎందుకు జారీ అయిందంటే?

    బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ ఎందుకు జారీ అయిందంటే?

    బెల్లకొండ సురేష్‌ నిర్మాతగా సిద్ధార్థ్‌, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నందీనీరెడ్డి దర్శకత్వంలో 2013లో ‘జబర్దస్త్' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హక్కులు రిలీజ్ ముందే ఓ టీవీ ఛానల్ రూ. 3.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే పలు కారణాలతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. టీవీ ఛానల్ వద్ద తీసుకున్న రూ. 3.5 కోట్లు చెల్లించడంలో బెల్లంకొండ విఫలం అయ్యారు. ఆ మొత్తం ఇపుడు వడ్డీతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరుకుంది. అతడు ఎంతకీ డబ్బు ఇవ్వక పోవడంతో వారు కోర్టుకెక్కారు. దీంతో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

    మరి ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది?

    మరి ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది?

    ‘జబర్దస్త్' సినిమా ఆగిపోవడానికి కారణం యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ కోర్టుకు ఎక్కడమే. రణవీర్ సింగ్ హీరోగా తాము నిర్మించిన ‘బాండ్‌ బాజా బరాత్‌' మూవీని కాపీ కొట్టారంటూ వారు కేసు వేశారు. విచారణలో 19 సీన్లు కాపీ కాపీ కొట్టినట్లు తేలింది. దీంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. శాటిలైట్లో కూడా సినిమా ప్రదర్శించకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    డబ్బు తిరిగి చెల్లించడంలో బెల్లంకొండ ఫెయిల్

    డబ్బు తిరిగి చెల్లించడంలో బెల్లంకొండ ఫెయిల్

    సినిమా ఆగిపోవడంతో శాటిలైట్ రైట్స్ కోసం రూ. 3.5 కోట్లు చెల్లించిన టీవీ ఛానల్ వారు బెల్లంకొండపై ఒత్తిడి పెంచారు. సంవత్సరాలు గడుస్తున్నా బెల్లంకొండ డబ్బు ఇవ్వక పోవడంతో సదరు ఛానల్ వారు కోర్టుకు ఎక్కారు. అలా ఒక సినిమాను కాపీ కొట్టడం అనేక మలుపు తిరిగి ఇక్కడి వరకు వచ్చింది.

    ఇదొక గుణపాఠం

    ఇదొక గుణపాఠం

    తెలుగులో చాలా మంది డైరెక్టర్లు ఇతర భాషా చిత్రాలను కాపీ కొట్టి సినిమాలు తీశారు. అయితే అప్పట్లో కాపీ వ్యవహారం ఇంత సీరియస్‌గా ఉండేది కాదు. కానీ ఇపుడు ఇతర దేశాల సినిమాలు కాపీ కొట్టినా వెంటనే తెలిసిపోతోంది. కాపీ కొట్టి సినిమాలు తీసేవారికి ఇలాంటి సంఘటనలు గుణపాఠం అని చెప్పొచ్చు.

    English summary
    Arrest warrant issued against Bellamkonda Suresh. Bellamkonda Suresh is an Indian film producer in the Telugu film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X