For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  XXX నిర్మాతకు ఆమె తల్లికి అరెస్ట్ వారెంట్.. సైనికుల భార్యలను అవమానించారని..

  |

  బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందింది ఏక్తా కపూర్. సీరియల్స్, వెబ్ సిరీస్ లతోపాటు అనేక సినిమాలను నిర్మించింది. అయితే ఈ నిర్మాత అప్పుడప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంటోంది. పలు కాంట్రవర్షియల్ సినిమాలు, షోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల లాకప్ అనే వివాదస్పద రియాలిటీ షోను రూపొందించిన ఏక్తా కపూర్ కు తాజాగా బుధవారం అంటే సెప్టెంబర్ 29న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆమెతోపాటు ఆమె తల్లి శోభ కపూర్ కు సైతం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది.

  లేడీ ప్రొడ్యూసర్ గా..

  లేడీ ప్రొడ్యూసర్ గా..

  బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ చిత్రసీమలో లేడీ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్, వెబ్ సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తూ ఆద్యంతం ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ మధ్య ఆల్ట్ బాలాజీ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా వరుసగా అనేక అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది ఈ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్.

  అడల్ట్ కంటెంట్ కు సెన్సార్ లేకపోవడం..

  అడల్ట్ కంటెంట్ కు సెన్సార్ లేకపోవడం..

  ఓటీటీల్లో అడల్ట్ కంటెంట్ కు సెన్సార్ లేకపోవడం, యూత్ ఆ వెబ్ సిరీస్ లకు బాగా అట్రాక్ట్ కావడంతో ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను వరుసగా లాంచ్ చేస్తుంది ఏక్తా కపూర్. ఈ క్రమంలోనే XXX అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో సీజన్ ను ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. అంతేకాకుండా అందులో పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  సైనికుల భార్యలను అవమానించారని

  సైనికుల భార్యలను అవమానించారని

  ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో దేశ సైనికుల భార్యలను అవమానించారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సన్నివేశాలు వారి కుటుంబాలను కించపరిచే విధంగా ఉండి.. వారి మనోభావాలను దెబ్బ తీసేవిధంగా చిత్రీకరించారని మాజీ సైనికుడు పిటిషన్ వేశాడు. XXX వెబ్ సిరీస్ లోని రెండో సీజన్ లో పలు సన్నివేశాలు సైనిలను, వారి కుటుంబ విలువలు దెబ్బ తీసేలా ఉన్నాయని 2020లో బీహార్ లోని బేగుసరైకు చెందిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ శంభు కుమార్ ఫిర్యాదు చేశాడు.

  ఇదివరకే హాజరుకావాల్సింది..

  ఇదివరకే హాజరుకావాల్సింది..

  అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ విషయమై శంభు తరఫు న్యాయవాది హ్రిషికేశ్ పాఠక్ మాట్లాడుతూ ''కోర్టు ఇదివరకే వాళ్లను హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, వాళ్లు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. అందుకే ఇప్పుడు వారికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది'' అని తెలిపారు. అంతేకాకుండా నిర్మాతగా ఎంతో డబ్బు సంపాదించిన ఏక్తా కపూర్ మనీ కోసం ఇలాంటి సిరీస్ లు నిర్మించడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

  ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు..

  ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు..

  ఈ XXX వెబ్ సిరీస్ రెండో సీజన్ పై ఇతర ప్రాంతాల్లో కూడా ఏక్తా కపూర్ పై కేసులు నమోదయినట్లు సమాచారం. 2020లో అన్నపూర్ణ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై నీరజ్ యగ్నిక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయింది. అంతేకాకుండా బీహార్ లోని ముజఫ్ఫర్పూర్ కోర్టులో కూడా ఫిర్యాదు దాఖలైంది.

  సొంత ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీ..

  సొంత ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీ..

  XXX వెబ్ సిరీస్ ను నిర్మించిన ఏక్తా కపూర్ తన సొంత ఓటీటీ సంస్థ ఆల్ట్ బాలాజీ (బాలాజీ టెలిఫిలీంస్ లిమిటెడ్) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఏక్తా కపూర్ తల్లి శోభ కపూర్ చూసుకుంటున్నారు. అందుకే ఆమె తల్లికి కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కాగా కేన్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కైరా దత్, అపర్ణా బాజ్ పాయ్, రిత్విక్ ధంజని, శంతను మహేశ్వరి, అంకిత్ గేరా, ప్రియాంక తాలుక్ దార్, అపర్ణ శర్మ తదితరులు నటించారు.

  English summary
  Bollywood Popular Producer Ekta Kapoor And Her Mother Shobha Kapoor Gets Arrest Warrant By Bihar Court For Making XXX Web Series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X