'ఆప్తుడు' చిత్రం ఫెయిల్యూర్ అయ్యే వ్యభిచార కేంద్రం
రాజశేఖర్...'ఆప్తుడు' చిత్రానికి ఆపరేటివ్ కెమెరామెన్ గా పని చేసి,దాదాపు 45 లక్షలు పెట్టుబడి పెట్టిన కురియన్ టోనీ జాకబ్ ని పోలీసులు అరెస్టు చేసారు. రోడ్ నెంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ లో అతను వ్యభిచార కేంద్ర నిర్వహిస్తూండగా రెడ్ హ్యాండెడ్ గా వెస్ట్ జోన్ టాస్క్ పోర్క్ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటి కమీషనర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, జాకబ్...హైదరాబాద్ పదేళ్ళ క్రిందట కేరళ నుంచి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చింది. అతను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఫిల్మ్ డిప్లమో కోర్సు చేసారు. అనంతరం అసోశియేట్ కెమెరామెన్ గా చేసారు. ఇక అతను ఆప్తుడు లో పెట్టిన డబ్బు మొత్తం పోవటంతో ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడిపోయాడు. త్వరగా డబ్బు చేసుకోవాలన్న యావలో ఈ వ్యభిచార కేంద్ర నడుపుతున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఇక బంజారా హిల్స్ లో రెంట్ కి ఇల్లు తీసుకుని బెంగుళూరు, చెన్నై, డిల్లీ, కలకత్తా, ముంబయి వంటి చోట్ల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యాపారం చేస్తున్నారు. పరిశ్రమలో తనకున్న పరిచయాలతో ఈ వ్యాపారం నడుపుతున్నట్లు చెప్తున్నారు. పేపర్లలో రకరకాల యాడ్స్ ఇచ్చి ఎట్రాక్ట్ చేసే వ్యాపారం రన్ చేసేవారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











