ఇకపై పూరి సినిమాల్లో ఫిల్మ్ ఉండదు
తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఇకపై తన సినిమాల్లో రీల్ వాడకుండా డిజిటల్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు. తన తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో' నుండే ఈ ట్రెండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం అత్యాధునికమైన 'ఆర్రి అలెక్నా కెమెరా సిస్టమ్స్' కొనుగోలు చేసారు. ఈ కెమెరాల ద్వారా హై క్వాలిటీ ఔట్ పుట్ వస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని 'లైఫ్ ఆఫ్ పై', స్కైఫాల్, అవెంజర్స్ లాంటి చిత్రాల్లో వాడారు. తెలుగులో తొలిసారిగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి వాడుతున్నారు.
ఇక ఇద్దరమ్మాయిలతో సినిమా విషయానికొస్తే...
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.
ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications












