'శక్తి' టైమ్ లోనే ఎన్టీఆర్ నుంచి ఆఫర్
'శక్తి' సినిమా సెట్స్ వేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. మే ఐదున జరగబోయే ఆయన వివాహానికి భారీ సెట్ వేయమని అంటున్నారు ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి. ఆయన తాజాగా పనిచేసిన శక్తి చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైంది.చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా అందులోని సెట్స్ కు మంచి పేరు వచ్చింది. పరిశ్రమవర్గాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే చిత్రంలోని కాళికా దేవి ఆలయం సెట్‌కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. మూడు నెలల పాటు 200 మంది నిర్విరామంగా పనిచేశారు అని అన్నారు.ఇక లడఖ్‌లో తీసిన ఆఖరి పాటలో చెట్టు ఉండాలి.సెట్‌లో ఒక చెట్టును ఏర్పాటు చేయడానికి లక్షరూపాయలు ఖర్చు పెట్టి వేరే దగ్గరి నుంచి చెట్టు తెప్పించాం అన్నారు.ఇక శక్తి సినిమా పూర్త్తయ్యాక 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఒక దేవాలయానికి అశ్వనీదత్ ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











