'అరుంధతి' ఆర్ట్ డైరక్టర్ కి కాపీ సినిమా ఖర్మేంటో!?
అరుంధతి, ఒక్కడు వంటి చిత్రాలకు ఆర్ట్ దర్శకత్వం వహించి నంది అవార్డులు అందుకున్న ఆర్ట్ డైరక్టర్ అశోక్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయన దర్శకుడుగా మారుతున్నారు. ఆయన దర్శకత్వంలో స్టైల్ చిత్రం సీక్వెల్ అంటూ ఓ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ చిత్రం దే దక్కా అనే మరాఠీ చిత్రం ఫ్రీమేక్ గా రూపొందుతోందని, అలాగే ఆస్కార్ విజేత లిటిల్ మిస్ సన్ షైన్ ఆధారంగా కొన్ని సన్నివేశాలు రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ధనాధన్ అనే టైటిల్ ని పెడుతున్నారు. అలాగే ఓ టీవీ రియాలటి షో చుట్టూ ఈ కథ తిరగనుందని తెలస్తోంది. ఆ మధ్య.ఈ చిత్రం కోసం ఆయన 10-14 సంవత్సరాల మధ్యగల క్లాసికల్ డాన్సర్స్ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు. అలాగే లగడపాటి గతంలో ఎవరి గోల వారిదే, స్టైల్ నిర్మించారు. ఇక దర్శకుడుగా మారుతున్న అశోక్...కంప్లీట్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే డైరక్టర్ గా మారేటప్పుడు కాస్త సొంత కథ అయితే బావుంటుందని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications











