లగడపాటి శ్రీధర్' స్టైల్-2' కి డైరక్టర్ అతనే
లగడపాటి శ్రీధర్ అప్పట్లో తమ లారెస్కో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైడాన్స్ మాస్టర్ లారెన్స్ ప్రధాన పాత్రలో అతని దర్శకత్వంలోనే స్టైల్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్టైల్ సినిమాకు సీక్వెల్ రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాడు. దానికి దర్శకుడుగా ఆర్ట్ డైరక్టర్ అశోక్ ని ఎన్నుకున్నట్లు సమాచారం. అలాగే లిటిల్ మిస్ సన్ షైన్ అనే ఆస్కార్ విన్నింగ్..చిత్రం ఆధారంగా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. లిటిల్ మిస్ సన్ షైన్ కథ మొత్తం ఓ చిన్నారి పాప ఓ డాన్స్ రియాలటీ షో లో పాల్గొనటం..విన్నవటం చుట్టూ తిరుగుతుంది. ఆ రియాలిటీ షోకు వెళ్ళే ప్రయాణంలో కథ ఎక్కువ భాగం నడుస్తుంది. ఇది ఓ జర్నీ మూవీ. ఆ ప్రయాణంలో ఆ పాప కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు పోయి అంతా ఒకటవటం కథాంశంగా ఉంటుంది. ఇక ఈ చిత్రానికి ప్లూట్ నాగరాజు సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి స్క్రిప్టు జరుగుతోంది..ఈలోగా లగడపాటి శ్రీదర్ తన మిత్రుడు మధుర శ్రీధర్ తో అతని దర్శకత్వంలో రూపొందిన స్నేహ గీతం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. జనవరి నెలలో ఈ స్నేహ గీతం రెడీ అవుతుంది.


Click it and Unblock the Notifications











