వయాగ్రా టాబ్లెట్ల యాడ్‌లో తెలుగు హీరోయిన్!
ఒకప్పుడు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రహీరోలతో నటిస్తూ టాప్ పొజిషన్లో కొనసాగిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రస్తుతం సినిమాల్లో కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అమ్మడు కనిపించక పోవడానికి కారణం అవకాశాలు తగ్గి పోవడమే. ఆ మధ్య ఆర్తి అగర్వాల్ హీరో తరుణ్ తో ప్రేమాయణం కొనసాగించిందని, అది బెడిసి కొట్టడం వల్లనే ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. తర్వాత ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేశారు. అయితే భర్తతో ఇమడలేక పోయిన ఈ భామ అతన్ని వదిలేసి మళ్లీ సినిమా పరిశ్రమపై పడింది. అయితే అవకాశాలు మాత్రం ఆమెకు ఎవరూ ఇవ్వడం లేదు. చివరి సారిగా 2009లో పోసాని జంటిల్మెన్ సినిమాలో నటించిన ఆర్తి మళ్లీ కనిపించలేదు.
అవకాశాలు తగ్గిపోయి ఆదాయం లేకుండా పోవడంతో ఆర్తి ప్రస్తుతం సెక్స్ టాబ్లెట్లు అమ్మడానికి సిద్ధం అయింది. తెలుగు టీవీ ఛానళ్లలో అర్థరాత్రి ప్రసారం అయ్యే ఓ కంపెనీ యాడ్ లో దర్శనం ఇస్తోంది. శృంగార ఉద్రేకాన్ని, సెక్స్ శక్తిని పెంచే సదరు టాబ్లెట్లు వాడితో పడక గదిలో మీరే కింగ్ అంటూ ప్రచారం చేస్తుంది. ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అవడం అంటే ఇదే మరి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఆర్తి అగర్వాల్...ప్రస్తుతం సెక్స్ టాబ్లెట్ల యాడ్ లో నటించే స్థాయికి దిగజారి పోయింది.


Click it and Unblock the Notifications











