Just In
- 2 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 3 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 3 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 4 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓవర్ డిమాండ్: రామ్ చరణ్-బోయపాటి సినిమా నుంచి రిషి పంజాబీ ఔట్....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ఆర్‌సి12 ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ తప్పుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే బాలీవుడ్లో కమిట్మెంట్స్ ఇవ్వడం వల్లే ఆయన తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా అతడిని తాత్కాలికంగా అక్టోబర్ వరకు కాంట్రాక్టు మీద తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అనుకోని కారణాలతో షూటింగ్ షెడ్యూల్ పొడగించాల్సి వచ్చింది. దీంతో అతడు ఎక్స్‌ట్రా పేమెంట్ డిమాండ్ చేశాడని చర్చించుకుంటున్నారు.
పెరిగిపోతున్న రాంచరణ్ సినిమా బడ్జెట్.. ఊహించని పరిణామాలు!

ఓవర్‌గా డిమాండ్ చేయడం వల్లనేనా?
అయితే బడ్జెట్ ఇప్పటికే ఎక్కువ అవుతుండటంతో అతడి సేవలు ఇక చాలని, రిషి పంజాబీ స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించారట. ఆయన స్థానంలో ఆర్థర్ ఎ విల్సన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన సినిమా షూటింగ్ విల్సన్ ద్వారా పూర్తి చేయనున్నారట. మరో 20 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం.

ఇంకా టైటిల్ ఖరారు కాలేదు
ప్రస్తుతం #ఆర్‌సి12 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. నటుడు ప్రశాంత్ రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో కనిపించనున్నారు. స్నేహ, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోయపాటి
రామ్ చరణ్‌తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అయ్యేలా తీర్చి దిద్దుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

టాలీవుడ్ భారీ మాస్ యాక్షన్ మూవీ కాబోతోందా?
దర్శకుడు బోయపాటి సినిమా అంటే మాస్ మెచ్చే భారీ యాక్షన్ దద్దరిల్లిపోయేలా ఉంటుంది. అందులో మెగా పవర్ స్టార్ లాంటి టాప్ యాక్టర్ ఉంటే... బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. రామ్ చరణ్ గత చిత్రం ‘రంగస్థలం' రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.