అమెరికా నుంచి వస్తున్న ఆర్తీ అగర్వాల్
ఆ మధ్య ఇంటి మెట్ల మీద నుంచి కిందికి జారిపడి తీవ్రంగా గాయపడిన హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ అమెరికానుంచి జూన్ 24న తిరిగి రానుంది. ప్రస్తుతం ఆమె తన సొంత నగరం లాంటి (ఆమె అక్కడే చిన్నప్పటినుంచి చదువుకుంది) న్యూజెర్సీలో ఇంతకాలం విశ్రాంతి తీసుకుంది. తెలుగులో ఒక వర్ధమాన నటుడిని ప్రేమించిన ఆమె, ఆ నటుడి తల్లి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆమె తీవ్ర మనస్ధాపం చెందినట్టు వార్తలు వచ్చాయి. తెలుగు పరిశ్రమకు రాగానే పెద్ద హీరోలతో నటించిన ఆర్తీ అగర్వాల్ గ్రహస్ధితి ప్రస్తుతం బాగున్నట్టు లేదు. ధైర్యం లేని ప్రియుడి కారణంగా ఆమె మానసిక క్షోభను అనుభవించవలసి వచ్చింది. ఆర్తీ అగర్వాల్- సునీల్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న అందాల రాముడు సినిమాకు ఆర్తి ప్రమాదం కారణంగా అవాంతరం ఏర్పడింది. జూన్ నెలాఖరులో ఆర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన కెరియర్ గురించి వివరించనుంది.


Click it and Unblock the Notifications