ఆర్తి కుటుంబీకుల అరెస్ట్

By Staff

ఆర్తి అగర్వాల్ పెళ్లి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధిపై దాడి చేశారన్న నేరారోపణల మీద ఆమె తండ్రి, చెల్లెలు, సోదరున్ని గాంధీనగర్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిపై 70బి, 323, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్తి అగర్వాల్ వివాహం బుధవారం రాణిగంజ్ ఆర్య సమాజ్ మందిర్ లో ఎన్నారై ఉజ్వల్ కుమార్ తో జరిగింది. వివాహాన్ని రహస్యంగా జరపాలని ఇరు కుటుంబాలు భావించినా మీడియా ప్రతినిధులు పెళ్లి జరుగుతున్న స్థలానికి పెద్దయెత్తున తరలిరావచ్చారు. ఇందులో టీవీ9 ప్రతినిధులు కూడా ఉన్నారు. పెళ్లి అయిపోయిన తరువాత ఆర్తి దంపతులు బయటకు వెళుతున్న సందర్భంలో విలేకరులను పక్కకు జరగండని ఆర్తి తండ్రి దురుసుగా చెప్పడంతో వివాదం మొదలైంది. ఈ వివాదంలో టీవీ9 ప్రతినిధిపై ఆర్తి తండ్రి శశాంక్ అగర్వాల్, సోదరి అతిథి అగర్వాల్, సోదరుడు ఆకాశ్ అగర్వాల్ దాడి చేశారు. బయటకు నెట్టారు. ఈ దాడిలో గాయపడ్డ టీవీ9 ప్రతినిధి కుమార్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత శశాంక్ అగర్వాల్, అతిథి అగర్వాల్, ఆకాశ్ అగర్వాల్ లను అరెస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X