పంజాలో సారాజేన్, అంజలి లవాణియాల పాత్రల గురించి...
పంజా సినిమాలో పవన్ కల్యాన్ సరసన సారా జేన్ డియాస్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె పాత్ర పేరు సంధ్య. మొక్కలన్నా, పూలన్నా చాలా ఇష్టం సంధ్యకు. గ్యాంస్టర్ అయిన జై(పవన్) ఆగొడవల నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ...తన అభిరుచి మేరకు మొక్కల, పూలు అమ్మే షాప్ రన్ చేస్తూ ఉంటాడు. అక్కడే సంధ్యకు, జైకి పరిచయం ఏర్పడుతుంది. తన ప్రేమను సంధ్యకు చెప్పడానికి పవన్ పడే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు.
గ్యాంగ్ వార్లు, తన బాస్ తో ఏర్పడ్డ వివాదాల కారణంగా జై....కోల్‌కతా విడిచి ఆంద్రఫ్రదేశ్ లోని సంధ్య వాళ్ల ఊరికి వెళతాడు. సంధ్య అన్నయ్య సుబ్బరాజు. ఈ ప్రాంతంలో సాంబశివుడు అనే కలప స్మగ్లర్ చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. చెట్లంటే ఎంతో ఇష్ట పడే సంధ్య సాంబశివుడిపై పోలీసులకు కంప్లంట్ ఇస్తుంది. దీంతో సాంబశివుడు మనుషులు సంధ్య కుటుంబంపై దాడి చేస్తారు. హీరో జై ఎంటరైన సాంబశివుడిని మట్టు పెడతాడు. ఇది సారా జేన్ పాత్ర గురించి బ్రీప్ గా...
అంజలి లవానియా క్లబ్ డాన్సర్ పాత్ర పోషించింది. జై అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ కారణంగా మున్నా(అడవిశేషు) ప్రేమను తిరస్కరించి, అతడి చేతిలో హతం అవుతుంది.


Click it and Unblock the Notifications











