సినిమా చూసి కృష్ణవంశీ నా దగ్గరకు వచ్చి తిట్టారు
"కృష్ణవంశీ నా ఫేవరెట్ డైరక్టర్. ఆయనంటే నాకు చాలా గౌరవం. ప్రస్ధానం సినిమా చూసిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి తిట్టడం మొదలుపెట్టారు. అయితే అది ప్రేమగా తిట్టిన తిట్లు అంటున్నారు సందీప్. ప్రస్దానంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసిన సందీప్ ఈ చిత్రం గురించి రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే తొలి చిత్రంలోనే అంత అద్భుతంగా ఎలా నటించావని తిడుతూనే ప్రేమగా అడిగారు. నా నటనకు అంతకుమించిన ప్రశంస ఏమి ఉంటుంది" అని సందీప్ చెప్పుకొచ్చారు.ఇక తాను ఆ పాత్ర అంత బాగా చేయటానికి కారణం ..ఆ పాత్ర బాగా నచ్చటమేనని చెప్పారు.
ఇక 'ప్రస్థానం' చిత్రం బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోవటానికి కారణం చెపుతూ..."నాకు తెలిసి ఒక సినిమా అంతగా ఆడకపోవటం వెనుక చాలా కారణాలుంటాయి. 'సిందూరం', 'అంత:పురం' లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. ఒక సినిమా బాగున్నప్పటికీ అది హిట్ కావడమనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. సినిమా తీయటం పూర్తి చేసుకునేసరికి ప్రేక్షకుల టేస్ట్ మారిపోవచ్చు. అంతెందుకు 'ప్రస్థానం' చిత్రంలో నాలుగు పాటలున్నాయి. కానీ మార్నింగ్ షో తర్వాత ఆ పాటలనే వెంటనే తొలగించాలని ప్రేక్షకులు కోరారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించేదే కమర్షియల్ సినిమా. బాక్సాఫీస్ దగ్గర హిట్ కావటం కోసమే సినిమాలన్నీ తయారవుతుంటాయి" అని సందీప్ తేల్చి చెప్పాడు.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం 'సూర్య సన్నాఫ్ క్రిష్ణన్' చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన సంగీప్ కి ప్రస్దానం మొదటిచిత్రం .రెండవ చిత్రం 'స్నేహగీతం'. ఇప్పుడు బాలాజీ టెలిఫిలింస్ ప్రొడక్షన్ లో తుషార్ కపూర్, సెంథిల్ రామ్మూర్తిలతో కలిసి తాను తొలిసారిగా హిందీలో నటించిన 'షోర్' చిత్రం రిలీజ్ కోసం కోసం సందీప్ ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











