ఏంటండి మాకీ గోల.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్.. మీమ్స్‌పై సెటైర్
సురేఖా వాణి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంది.. అదే దారిలో సురేఖా వాణి కూడా అడుగులు వేస్తోందంటూ ఒకటే రూమర్ తెగ ప్రచారమైంది. అలా ఆ రూమర్ అన్నీ ప్రధాన మీడియాల్లోనూ వచ్చేసింది. అయితే వాటిపై సురేఖా వాణి గట్టిగానే కౌంటర్ వేసింది. వాటిలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ వాటిపై మీమ్స్ మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి.

సునీత పెళ్లి అంటూ..
గతంలో సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటే ఎన్నో సార్లు రూమర్లు వచ్చాయి. కానీ చివరకు అవే నిజమయ్యాయి. నిశ్చితార్థం ఫోటోలు బయటకు రావడంతో సునీతనే నేరుగా వచ్చి స్పందించేసింది. తన రెండో పెళ్లిపై ప్రకటన చేసింది. రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో జరిగిన చర్చలు కూడా అందరికీ తెలిసిందే.

సురేఖా వాణి కూడా..
నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ 2019లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూతురే లోకంగా బతుకుతోంది. తన కూతురు సుప్రితతో కలిసి ఎంతో సంతోషంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య తన కూతురు ఒత్తిడి చేస్తోందని, అందుకే రెండు పెళ్లికి సిద్దమైందని రూమర్లు బయటకు వచ్చాయి.

ఖండించిన సురేఖా వాణి..
తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలపై సురేఖా వాణి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంతే కాకుండా తనకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలేమీ లేవని కూడా స్పష్టం చేసింది. దాంతో ఆ రూమర్లకు తెరపడింది. అయితే ఆ రూమర్లపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ మాత్రం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

మీమ్‌పై రియాక్షన్..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖా వాణి ట్రోల్స్, మీమ్స్‌పై ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటుంది. తాజాగా అలానే తన రెండో పెళ్లిపై వచ్చిన ఓ మీమ్‌పైనా సెటైర్ వేసింది. సురేఖా వాణి వేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఏంటండి మాకీ గోల..
సురేఖా వాణికి రెండో పెళ్లి అని తెలియడంతోనే అంకుల్స్ అందరూ ఆమె ఇంటి ముందు క్యూ కట్టినట్టు ఓ మీమ్ వచ్చింది. దానిపై సురేఖా వాణి స్పందిస్తూ.. ఏంటండి మాకీ గోల అని సెటైర్ వేసింది. మొత్తానికి తన ఫాలోయింగ్ గురించి సురేఖా వాణి చెప్పకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











