twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో డిజాస్టర్ సినిమా

    By Staff
    |

    Bank
    నిన్న రిలీజయిన 'బ్యాంక్' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.నూతన దర్శకుడు కె.అరుణ్‌ కుమార్‌ స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం చూసిన వారికి విరక్తి పుట్టిస్తోందని సమాచారం. ఇక కథ రాహుల్ దేవ్,రఘువరన్,జాకీ ష్రాఫ్,అబ్బస్,వేద అనే ఓ ఐదుగురు దొంగల చుట్టూ తిరుగుతుంది. వారు ఓ ప్రేవేట్ బ్యాంక్ సాప్ట్ వేర్ కరప్ట్ చేయటం ద్వారా వంద కోట్ల రూపాయలు దొంగతనం చేస్తారు. అయితే ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు ాల్చిన ఓ బుల్లెట్ తగలటంతో ఆ టీమ్ లీడర్..జాకీ ష్రాఫ్ కి తగులుతుంది. అతను చనిపోబోతూ ఆ డబ్బుని ఓ నూతిలో పెట్టి దాస్తాడు. గుర్తు కోసం రక్తంతో ఓ మ్యాప్ గీస్తాడు.

    అది అక్కడే ఉన్న ఓ టీ కొట్టు వాడికిచ్చి,తన వాళ్ళకివ్వమని మరణిస్తాడు. ఇక మిగతా ముగ్గురుని పోలీసులు పట్టుకుంటారు. తర్వాత నాలుగేళ్ళకు వాళ్ళు రిలీజై ఆ మ్యాప్ పట్టుకుని నూతి దగ్గరకు చేరుకుంటారు. అయితే అప్పటికే అక్కడో ఇల్లు కట్టి ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించి ఆ డబ్బుని ఎట్లా స్వాదీనం చేసుకున్నారనేది మిగతా కథ. ఈ మధ్యనే వచ్చిన బ్లేడు బాబ్జీని గుర్తు చేసే పాయింటుకు రిజర్వాయర్ డాగ్స్ ,డాగ్ డే ఆఫ్టర్ నూన్ వంటి బ్యాంకు దోపిడీ సినిమా ముక్కలు కలిపి ఈ సినిమాని తయారు చేసారు. ఇక కథనం చాలా దారుణంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X