సాహోలో విలన్ నేను కాదు.. ప్రభాస్‌ను ఎదురించేది ఎవరు? కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ
Recommended Video

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో వెలుగు చేసింది.

అరుణ్ విజయ్ క్లారిటీ
సాహా చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మరో విలన్ కూడా ఉన్నారు. ఆ విలన్ పాత్రను తమిళ నటుడు అరుణ్ విజయ్ పోషిస్తున్నట్టు మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఆ వార్తలపై స్పందించిన అరుణ్ విజయ్ ఈ కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ ఇచ్చారు.

ఆ వార్తలో నిజం లేదు..
ప్రస్తుతం థాండమ్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. సాహోలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాను. అయితే నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి విలన్ పాత్రలో కనిపిస్తున్నాను అనే వార్తలో నిజం లేదు అరుణ్ విజయ్ తెలిపారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన యెన్నై అరిందాల్ చిత్రంలో అరుణ్ విజయ్ పోషించిన విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

పాజిటివ్ క్యారెక్టర్‌లోనే
నేను నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం లేదు. నాది పాజిటివ్ క్యారెక్టర్. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నాపై కొన్ని సన్నివేశాల చిత్రీకరించాల్సి ఉంది అని అరుణ్ విజయ వెల్లడించారు.

2018 ద్వితీయార్థంలో
థాండమ్ చిత్రం తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తున్నాను. ఈ చిత్రం 2018 ద్వితీయార్థంలో ప్రారంభం అవుతుంది. నాకు కెరీర్‌లో 25వ చిత్రం అని అరుణ్ విజయ్ తెలిపారు.

సాహోలో కెన్నీ బేట్స్
కాగా, సాహో చిత్రంలో యాక్షన్ సీన్లను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు హాలీవుడ్ నుంచి కెన్నీ బేట్స్ అనే యాక్షన్ డైరెక్టర్‌ను రప్పించారు. ఈయన గతంలో డైహార్డ్, ట్రాన్స్‌ఫార్మర్ చిత్రాలకు ఫైట్స్ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











