Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫోటోలు: సాహో యాక్షన్ సీన్స్ కోసం వాడే కార్లు ఇవే.. అదిరిపోవడం ఖాయం!
Recommended Video
బాహుబలి ప్రభంజనం తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుండగా నిల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు. మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్ విజయ్, ఎవిలిన్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరుణ్ విజయ్ తాజాగా ఈ చిత్ర షూట్ లో జాయిన్ అయిన సందర్భంగా చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ఎక్కువ భాగం విదేశాల్లోనే
సాహో చిత్రానికి సంబందించిన ఎక్కువభాగం షూట్ దుబాయ్, అబుదాబి, రొమేనియాలో జరుగుతోంది. చాలా రోజులుగా ఈ ప్రాంతాలలోనే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై తరువాత ఎక్కువ బడ్జెట్ తో దుబాయ్ లో షూట్ జరుపుకుంటోన్న చిత్రం సాహో కావడం విశేషం.
90 కోట్లు యాక్షన్ సీన్స్ కోసమే
కనివిని ఎరుగని యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంది. ఏకంగా యాక్షన్ సన్నివేశాలకే 90 కోట్లు వెచ్చిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
|
కారు సన్నివేశాలు
అరుణ్ విజయ్ సాహో చిత్ర షూట్ లో జాయిన్ అయ్యాక తాజాగా కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. భారీ స్థాయిలో కారులతో చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు పోస్ట్ చేశాడు. అబుదాబిలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఆ మధ్యన బైక్ పై ప్రభాస్ స్టంట్స్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం
ఇండియన్ చిత్రాలలో సాహో బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం కాబోతోందని విలన్ పాత్ర పోషిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ ఇటీవల అన్నారు. మందిరా బేడీ, ఎవిలిన్ శర్మ వంటి ప్రముఖ తారలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.