నీ కంటే కూల్ ఎవరు దాదా.. ప్రభాస్ ఫోటో వైరల్, సాహో సెట్లోని ఫోటో లీక్ చేసిన హీరో! (ఫొటోలు)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చిత్రం ఇప్పటి వరకు ఫ్యాన్స్‌ను చేరలేదు. దాంతో భారీ అంచనాలే నెలకొంటున్నాయి. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో అరుణ్ విజయ్ సినిమా షూటింగ్‌లో తీసుకొన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..

క్రేజీస్టార్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో
సాహో చిత్రం నేషనల్ ప్రాజెక్ట్‌గా మారింది. ఈ చిత్రంలో బాహు భాషా నటులు నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా తమిళ నటుడు అరుణ్ విజయ్, హిందీ స్టార్ హీరో జాకీ ష్రాఫ్, మలయాళ నటుడు లాల్, ప్రభాస్ కలవడంతో సెట్ అంతా ఫీల్‌గుడ్ మూమెంట్స్‌తో సాగుతున్నదట. అందరూ కలిసి ఫోటోకు ఫోజిచ్చారు.

అరుణ్ విజయ్ షేర్ చేసిన ఫొటో ఇదే
ఇండస్ట్రీ మహామహులంతా ఏకమై ఓ ఫ్రేమ్‌లో బంధించిన ఫోటోను దాచుకోవడానికి కష్టమైన అరుణ్ విజయ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. సెట్స్‌లో నీకంటే కూల్ పర్సన్ ఎవరుంటారు? ఇంత వరకు నేను చూడలేదు జాకీ ష్రాఫ్ సార్ అంటూ అరుణ్ విజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రభాస్‌తో కలిసి అరుణ్ విజయ్
అలాగే ప్రభాస్‌తో ఉన్న స్వీటెస్ట్ మూమెంట్స్‌ను అరుణ్ విజయ్ తన సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. ఇటీవల డైరెక్టర్ సుజిత్ రెడ్డి, ప్రభాస్‌తో ఉన్న ఫొటోను అరుణ్ విజయ్ ట్వీట్ చేశారు. నా స్వీటెస్ట్ డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ సుజిత్‌తో సాహో సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఫోటోను పెట్టారు.

టాలీవుడ్‌కు తొలిసారి శ్రద్దాకపూర్
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నారు. ఇంకా నీల్ నితిన్ ముఖేష్, మందిరాబేడి, ఎవ్లీన్ శర్మ తదితరులు సాహో కోసం బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానున్నది.

రూ.350 కోట్లతో సాహో
సాహో చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని దర్శకుడు రూ.350 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు ఇండస్ట్రీలో ఓ టాక్‌గా మారాయి. ఈ సినిమా టీజర్లు ఇప్పటికే భారీ అంచనాలు పెంచాయి.


Click it and Unblock the Notifications











