Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాగచైతన్య ‘దడ’లో ఆ సెక్సీ భామ ఐటం సాంగ్
నాగ చైతన్య, కాజల్ అగ ర్వాల్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'దడ"చిత్రంలో సెక్సీ మోడల్,బాలీవుడ్ మాజీ హీరోయిన్ అరుణ్ షీల్డ్ ఐటం సాంగ్ చేస్తోంది. అరుణా షీల్డ్ రీసెంట్ గా వివేక్ ఒబరాయ్ ప్రిన్స్ చిత్రంలో చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఐటం సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ విషయాలను నిర్మాత శివప్రసాదరెడ్డి మీడియాకు తెలియబరుస్తూ... 'యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తిచేశాం. బ్యాలెన్స్ ఉన్న ఐటెం సాంగ్ బాలీవుడ్ హీరోయిన్ అరుణ షీల్డ్స్‌తో చేయనున్నాం. ఈ పాటతో షూటింగ్ పార్టు పూర్తవుతుంది అని తెలిపారు.
అలాగే రొమాంటిక్ ఇమేజ్ ఉన్న చైతన్యను ఈ సినిమా మాస్ హీరోగా నిలబెడుతుంది. ఆయన పాత్రలో ఎన్నో డైమన్షన్లు ఉంటాయి. ఇటీవలే యూరప్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. ఒక్క ఐటమ్ సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్లో, నాగచైతన్య, అరుణ షీల్డ్స్‌పై ప్రేమ్క్ష్రిత్ నృత్య దర్శకత్వంలో నేటి నుంచి ఆ పాట చిత్రీకరణ జరుగుతుంది. జూలైలో ఆడియోను, ఆగస్ట్ రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు.
శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్, ముఖేష్ రిషి, కెల్లీ డార్జ్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, ఇయాజ్‌ఖాన్, కులదీప్, జునైద్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి కథ: అజయ్ భుయాన్, శివ్‌సింగ్, కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, మాటలు: అబ్బూరి రవి, ఆర్ట్: జె.కె.మూర్తి, కో-ప్రొడ్యూసర్: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాణం: శ్రీకామాక్షి ఎంటర్ప్రైజెస్.