అరుంధతికి ఇవాళా చుక్కెదురే

By Staff

Arundhathi
అనూష్క ప్రథాన పాత్రలో ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాధ్ నిర్మించిన భారీ గ్రాఫిక్ చిత్రం అరుధంతి ఈ రోజు కూడా రిలీజ్ కావటం లేదు. నిజానికి నిన్న రిలీజు (సంక్రాంతి రోజున) అవ్వాల్సిన ఈ సినిమాని సాంకేతిక కారణాలంటూ ఈ రోజుకి(15వతేది)కి వాయిదా వేసారు. అయితే ఇవాళ కూడా ఆ సాంకేతిక కారణాలు రెక్టిఫై కాలేదని రేపటకి (శుక్రవారం)కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అయితే ఫిల్మ్ నగర్ సమాచరం ప్రకారం స్టార్ కాస్ట్ లేని ఈ సినిమాపై దాదాపు పదహారు కోట్లు దాకా ఖర్చు పెట్టి ఇప్పటికీ ఫెరఫెక్షన్ అంటున్న నిర్మాతకి అమ్మకాలు ఆ రేంజిలో పలకటం లేదంటున్నారు.

దాంతో ల్యాబ్ వద్ద ప్రింట్స్ ప్లాబ్లం ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు. అయినా సినిమా లేటయిందంటే ఈ రోజుల్లో ఆ సినిమాపై ప్రేక్షకుడు నమ్మకం కోల్పోతాడని తెలిసినా గ్రాఫిక్స్ కోసమని చెపుతూ డిలే చేస్తున్నారని,అలాగే బిజెనెస్ కి మించి విపరీతంగా ఖర్చు పెట్టారని..ఎన్ని రోజులు ఆడితే ఆ మొత్తం వెనక్కి తిరిగివస్తుందని అంటున్నారు. సినిమా రిలీజై హిట్టయితే చాలదని,సూపర్ హిట్టవ్వాలని లేకపోతే రికవరీ కష్టం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే సినిమాపై విపరీతమైన ప్రేమలో ఓ నిర్మాతగా అధ్బుతం సృష్టించాలన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆశనూ కొట్టపడేయలేము.అందుకే రేపయినా వాయిదా పడకండా రిలీజై సంచలన విజయం చేకూర్చాలని కోరుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X