twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూష్క ఇక చుక్కలు చూపిస్తుందా?

    By Staff
    |

    Arundhathi
    అరుంధతి సూపర్ హిట్ అనూష్కని ఎక్కడికో తీసుకుపోయేటట్లు ఉంది. ఆ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి దాన్ని హిందీ,తమిళ,మళయాళం,కన్నడ,భోజపురి,బెంగాళి,ఇంగ్లీష్ లలో అనువదించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఇటువంటి హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఇంగ్లీష్ లో తప్పించి భారతీయ భాషల్లో రావటం కష్టం గాబట్టి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. దాంతో అనూష్క ఏడు భాషల్లోకి వెళ్ళే అవకాశం లభిస్తోంది.

    అందులోనూ హిట్ సినిమాతో వెళ్తోంది కాబట్టి అక్కడ సినీ జనాన్ని కూడ ఆకర్షించి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటికే అనూష్క తమిళంలో పాపులర్ అయింది. ఇక అరుంధతి ఇతర స్టేటుల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆమె డిమాండ్ పెరిగి ఆమె నటించిన మిగతా సినిమాలుకు కూడా డిమాండ్ పెరుగుతుందనటంలో సందేహం కాదు. అప్పుడు రేటు కూడా పెంచుతుంది.అసలే ఇప్పటికే ఈ యేడు రెండు సార్లు రేటు పెంచిన ఆమె ఇక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని ఫిల్మ్ నగర్ లో నిట్టూరుస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X